Gorantla Madhav: మాధవ్ వికృత చేష్టలను ప్రపంచం చూసింది: అనిత

ABN , First Publish Date - 2022-08-18T23:53:38+05:30 IST

ఎంపీ గోరంట్ల మాధవ్ వికృత చేష్టలను ప్రపంచం చూసిందని టీడీపీ నేత అనిత (Anitha) తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ

Gorantla Madhav: మాధవ్ వికృత చేష్టలను ప్రపంచం చూసింది: అనిత

అమరావతి: ఎంపీ గోరంట్ల మాధవ్ వికృత చేష్టలను ప్రపంచం చూసిందని టీడీపీ నేత అనిత (Anitha) తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తప్పుచేసిన వారిని రక్షించేందుకు పోలీసులు తిప్పలు పడుతున్నారని విమర్శించారు. సంబంధంలేని సీఐడీ (CID) వాళ్లు వచ్చి వివరణ ఇవ్వటమేంటి? అని ప్రశ్నించారు. ఫేక్ రిపోర్టులు అన్నప్పుడు.. అసలు రిపోర్టు ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. రిపోర్టులు బయటపెట్టేందుకు ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. వైసీపీ (YCP) నేతలు ఎందుకు వివరణ ఇవ్వడం లేదన్నారు. మాధవ్ రిపోర్ట్ చేశారని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ చెప్పారని తెలిపారు. గతంలో మాధవ్ రిపోర్ట్ చేయలేదని అధికారులు చెప్పారని, ఈ రకమైన తప్పులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారని తెలిపారు. అశ్లీల వీడియో మాధవ్దా?.. కాదా? అనేది విషయం ఎవరూ తెల్చడం లేదని అనిత ప్రశ్నించారు. 


గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) న్యూడ్ వీడియో (Nude Video)పై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ సీఐడీ (AP CID) వివరణ ఇచ్చింది. దీనికి సంబంధించి గురువారం ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ (DG Sunil Kumar) మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంపీ మాధవ్ వీడియో కాల్ ఇద్దరి మధ్య జరిగిందని, మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియో అదని చెప్పారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోను.. ల్యాబ్కి పంపి రిపోర్టు తీసుకున్నారని, ప్రైవేట్ ల్యాబ్ ఇచ్చే నివేదికకు విలువ ఉండదన్నారు. వీడియోలో ఉన్న కంటెంట్ వాస్తవమా?.. కాదా?.. అనే విషయం ఆ ల్యాబ్ చెప్పలేదని డీజీ సునీల్ కుమార్ అన్నారు.

Updated Date - 2022-08-18T23:53:38+05:30 IST