
విశాఖ: వైసీపీ నేతలపై తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం ఆమె ఇక్కడ మీడియతో మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై.. ఎక్కువ మ౦ది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే ఉన్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు అఘాయిత్యాలు చేస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించరా? అని ప్రశ్నించారు. అమ్మాయిల కిడ్నాప్‌లో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. హైదరాబాద్‌లోని వ్యభిచార గృహంలో.. మంత్రి అనిల్ కుమార్ అనుచరులు పట్టుబడిన విషయాన్ని ఈ సందర్భంగా అనిత గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి