అంకమ్మ తల్లి ఆలయం పునఃనిర్మాణానికి నిర్ణయం

ABN , First Publish Date - 2021-07-25T07:11:33+05:30 IST

కందుకూరు గ్రామ దేవత అంకమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ ం కోసం ఆగస్టు 25న శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.

అంకమ్మ తల్లి ఆలయం పునఃనిర్మాణానికి నిర్ణయం
ఎమ్మెల్యే సమక్షంలో సవవేశమైన ఆలయ కమిటీ ప్రతినిధులు

కందుకూరు, జూలై 24: కందుకూరు గ్రామ దేవత అంకమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ ం కోసం ఆగస్టు 25న శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. దేవాలయాల స్తపతి రామసుబ్బయ్యశాస్ర్తి,  ఎమ్మెల్యే మానుగుంట మహీధర రెడ్డి, పండితులు, ఇతర ఆలయపెద్దల సమక్షంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఆలయ పునర్నిర్మాణం పూర్తయ్యేంతవరకు భక్తులు పూజా కార్యక్రమాల నిర్వహణ కోసం నిర్మిస్తున్న బాలాలయంలో ఆగస్టు 16న ఉదయం ప్రతిష్ట మహోత్సవం నిర్వహించాలని, ఆగస్టు 25న ప్రధాన ఆలయ పునఃనిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ముహూర్తం నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మానుగుంట మహీధర రెడ్డి మాట్లాడుతూ.. అంకమ్మతల్లి ఆలయాన్ని పట్టణానికి తలమానికంగా నిర్మించేందుకు నమూనా సిద్ధం చేశామన్నారు. శంకుస్థాపన పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించి శరవేగంగా ఆలయాన్ని పునఃనిర్మిస్తామన్నారు. బాలాలయం ప్రతిష్ట, ప్రధాన ఆలయ శంకుస్థాపన కార్యక్రమాలలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆలయ నిర్మాణ ం పూర్తయ్యాక అమ్మవారి మూలవిరాట్‌ పీఠం కింద మేలిమి బంగారంతో తయారుచేయించిన యంత్రాన్ని ప్రతిష్టించనున్నట్లు తెలిపారు. కనీసం 600 గ్రాముల బంగారంతో ఈ యంత్రాన్ని తయారు చేయించాల్సి ఉందన్నారు. ఈ యంత్రం కోసం భక్తులు తలా ఒక గ్రాము బంగారాన్ని విరాళంగా సేకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర రెడ్డితో పాటు దివి లింగయ్యనాయుడు, ఆలయ ఇఓ కృష్ణవేణి, కమిటీ పెద్దలు వై.వెంకటరెడ్డి, వసంతరావు, వేణుగోపాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక గ్రామ బంగారం కోసం గళ్లా వెంకట కృష్ణారావు రూ. 5వేలు, చీదెళ్ల వేణుగోపాలరావు 5వేల రూపాయలు కమిటీ పెద్దలకు విరాళంగా అందజేశారు. 


Updated Date - 2021-07-25T07:11:33+05:30 IST