మడమనొప్పి బాధిస్తుంటే..!

ABN , First Publish Date - 2021-04-21T19:34:11+05:30 IST

మడమ నొప్పి చాలా మందిని వేధిస్తుంది. ఉదయాన లేవగానే నాలుగు అడుగులు వేయడానికి నొప్పితో విలవిల్లాడిపోతారు. ఈ నొప్పికి కారణం ప్లాంటార్‌ ఫేసియాపైన ఒత్తిడిపడటమే. ఎక్కువ గంటలు నిలుచుని ఉండటం వల్ల పాదంపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా పాదంలో ఉండే ప్లాంటార్‌ ఫేసియా వాపుకు

మడమనొప్పి బాధిస్తుంటే..!

మడమ నొప్పి చాలా మందిని వేధిస్తుంది. ఉదయాన లేవగానే నాలుగు అడుగులు వేయడానికి నొప్పితో విలవిల్లాడిపోతారు. ఈ నొప్పికి కారణం ప్లాంటార్‌ ఫేసియాపైన ఒత్తిడిపడటమే. ఎక్కువ గంటలు నిలుచుని ఉండటం వల్ల పాదంపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా పాదంలో ఉండే ప్లాంటార్‌ ఫేసియా వాపుకు గురవుతుంది. దీనిమూలంగా నొప్పి ప్రారంభమవుతుంది. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.


బెడ్‌ పైనుంచి దిగే ముందు కొన్ని వ్యాయామలు చేయాలి. పాదం, మడమను పైకి కిందకు, పక్కలకు తిప్పాలి.

15 నుంచి 20 నిమిషాల పాటు నొప్పి ఉన్న భాగంలో ఐస్‌ప్యాక్‌ పెట్టాలి. రోజులో ఇలా మూడు, నాలుగు సార్లు చేయాలి. 

మడమనొప్పి ఉన్న వారి కోసం ప్రత్యేకంగా తయారుచేసిన చెప్పులు లభిస్తాయి. వాటిని ధరించాలి.  

కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి.

అధిక బరువు ఉన్నట్లయితే తగ్గించుకోవాలి. ఎక్కువ సమయం నిలుచుని ఉండకూడదు.

విటమిన్‌ డి, బి12 లోపం ఉన్నట్లయితే మందులు వాడాలి. 

మంచి పోషకవిలువలున్న డైట్‌ను మాత్రమే తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మడమనొప్పి నుంచి బయటపడవచ్చు.

Updated Date - 2021-04-21T19:34:11+05:30 IST