డెక్కన్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌లో అంకురిట్‌ క్యాపిటల్‌ పెట్టుబడులు

ABN , First Publish Date - 2022-07-13T00:14:37+05:30 IST

సెబీ నియంత్రణలోని ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్‌ అంకురిట్‌ క్యాపిటల్‌ (Ankurit Capital).. సుప్రసిద్ధ న్యూట్రాస్యూటికల్‌

డెక్కన్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌లో అంకురిట్‌  క్యాపిటల్‌ పెట్టుబడులు

న్యూఢిల్లీ:  సెబీ నియంత్రణలోని ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్‌ అంకురిట్‌ క్యాపిటల్‌ (Ankurit Capital).. సుప్రసిద్ధ న్యూట్రాస్యూటికల్‌, కాస్మెస్యూటికల్‌  ఉత్పత్తుల కంపెనీ డెక్కన్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ (Deccan Health Care Ltd)లో 7.71 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఈ కంపెనీకి 13.30 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కో షేర్‌కు రూ. 37.60 ధరతో  తమ ప్రిఫరెన్షియల్‌ ఇష్యూలో భాగంగా  డెక్కన్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌  కేటాయించింది.


ఈ కేటాయింపులపై చైర్మన్ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మింటో పురుషోత్తం గుప్తా మాట్లాడుతూ.. తమ కంపెనీ వృద్ధిలో భారీ మదుపరులు సైతం ఆసక్తి చూపుతుండటంపై సంతోషంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా వచ్చిన మొత్తాలను  మిలీనియల్స్‌ కోసం గేమిఫైడ్‌ హెల్త్‌, వెల్‌నెస్‌లో డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కోసం వినియోగించనున్నట్టు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో తమ బ్రాండ్‌ స్థానాన్ని బలోపేతం చేయడంతో  పాటు ఆర్గానిక్‌ వృద్ధి కోసం  శక్తివంతమైన కమ్యూనిటీ నిర్మిస్తామన్నారు. అంతేకాదు, ఈ విభాగంలో  ఆధిపత్యం చూపే డీ2సీ ప్లేయర్‌గా కూడా నిలుస్తామని పేర్కొన్నారు.


దీంతో పాటు ఆఫ్‌లైన్‌ స్టోర్లలో  తమ ఉనికిని విస్తరిస్తూనే యూఏఈ, యూఎస్‌ఏ లాంటి అంతర్జాతీయ మార్కెట్‌లలో సైతం విస్తరించనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం యూఎస్‌ఏలో 600 రిటైల్‌ స్టోర్లలో తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు అవకాశాలను అన్వేషిస్తున్నట్టు వివరించారు.


అంకురిట్‌  కో ఫౌండర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నటాషా మాట్లాడుతూ.. న్యూట్రాస్యూటికల్స్‌, కాస్మెస్యూటికల్స్‌ రంగంలో ఇప్పటికే అగ్రగామి సంస్థగా డెక్కన్‌ హెల్త్‌కేర్‌ నిలిచిందన్నారు. ఈ సంస్థ ఉత్పత్తి చేసిన 90కు పైగా ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్నట్టు తెలిపారు. డిజిటల్‌ శక్తివంతమైన డీ2సీ  బ్రాండ్‌గా వారి పరివర్తనక మద్దతు ఇచ్చేందుకే పెట్టుబడులు పెడుతున్నట్టు వివరించారు. డీఎల్‌ఎస్‌ లా ఆఫీసెస్‌  ఫౌండర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దీప్తి లావ్య స్వాయిన్‌  ఈ పెట్టుబడికి న్యాయ సలహాదారునిగా వ్యవహరిస్తారు.


 

Updated Date - 2022-07-13T00:14:37+05:30 IST