Anna canteen: వర్షాన్ని లెక్క చేయకుండా అన్నక్యాంటీన్ నిర్వహణ

ABN , First Publish Date - 2022-09-19T17:48:44+05:30 IST

జిల్లాలోని తిరువూరు పట్టణంలో టీడీపీ నేతలు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా అన్న క్యాంటీన్‌ను నిర్వహించారు.

Anna canteen: వర్షాన్ని లెక్క చేయకుండా అన్నక్యాంటీన్ నిర్వహణ

ఎన్టీఆర్: జిల్లాలోని తిరువూరు పట్టణంలో టీడీపీ నేతలు (TDP Leaders) వర్షాన్ని కూడా లెక్కచేయకుండా అన్న క్యాంటీన్‌ (Anna canteen)ను నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తిరువూరు మధిర రోడ్డు ఎన్టీఆర్ సెంటర్లో పట్టణ టిడిపి పార్టీ నేతలు ఒకరోజు అన్న క్యాంటీన్‌ను నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు  అర్పించిన  తర్వాత అన్న క్యాంటీన్‌ను నేతలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాస్ దంపతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-19T17:48:44+05:30 IST