
- 23 మంది అరెస్టు
ప్యారీస్(చెన్నై): కోయంబత్తూర్ జిల్లాలో మకాం వేసిన పొరుగు జిల్లాల డీఎంకే నేతలను స్వస్థలాలకు తరలించాలన్న డిమాండ్‌తో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కలెక్టరేట్ ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలిపారు. అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి, 9 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, పార్టీ నిర్వాహకులు సహా 23 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పురపాలక ఎన్నికల ప్రచార గడువు ముగిసినప్పటికీ, కోయంబత్తూర్ జిల్లాలోని అన్ని వార్డుల్లో పొరుగు ప్రాంతాలకు చెందిన డీఎంకే శ్రేణులు జిల్లా నుంచి వెళ్లలేదని, దీనిపై పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదని, అందువల్లే కలెక్టరేట్లో ఆందోళన చేపట్టినట్లు ఆందోళనకారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ సమీరన్ ఈ సమస్యను పరిష్కరింపజేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి