అన్నదాత ఆందోళన

ABN , First Publish Date - 2021-04-23T04:51:25+05:30 IST

నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రధాన నీటి వనరు అయిన మహాత్మా గాం ధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్‌ఐ) కింద యాసంగిలో వివిధ పంటలు సాగు చేసిన రైతుల్లో ఆం దోళన నెలకొన్నది.

అన్నదాత ఆందోళన
తుమ్మలపల్లిలో సాగునీరు అందక ఎండిపోతున్న వరి

- శ్రీశైలం డెడ్‌ స్టోరేజ్‌తో ఇక్కట్లు 

- ఎంజీకేఎల్‌ఐ ఆయకట్టుకు చివరి దశలో అందని సాగునీరు


నాగర్‌కర్నూల్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రధాన నీటి వనరు అయిన మహాత్మా గాం ధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్‌ఐ) కింద యాసంగిలో వివిధ పంటలు సాగు చేసిన రైతుల్లో ఆం దోళన నెలకొన్నది. వరి పొట్టకొచ్చిన దశలో శ్రీశైలం జలాశయం డెడ్‌ స్టోరేజ్‌కు పడిపోవడం వల్ల ఎంజీకేఎ ల్‌ఐ ద్వారా పంపింగ్‌ వ్యవస్థ నిలిచిపోయింది. దీంతో వేలాది ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసిన రైతు లు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితికి ఇరిగేషన్‌, వ్యవసాయ అధికారులు రైతులకు సరైన అవగాహన కల్పించకపోవడమే కారణమని విమర్శలు వస్తున్నాయి.

ఎంజీకేఎల్‌ఐ కింద ఈ సీజన్‌లో జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కొల్లాపూర్‌, కల్వకుర్తి ని యోజకవర్గాల పరిధిలో 2,99,534 ఎకరాలలో పంటలు సాగయ్యాయి. ఇందులో 1,42,772 ఎకరా ల్లో వరి, 1,34,096 ఎకరాల్లో వేరుశనగ, 7,481 ఎకరాల్లో మొక్కజొన్న, 1,272 ఎకరాల్లో జొన్న సా గైంది. పథకంలో మొదటి లిఫ్టు మునకకు గురికావడం వల్ల తలెత్తిన సాంకేతిక సమస్యలను రై తులకు వివరించడంలో ప్రధాన శాఖలకు చెందిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ సీజన్‌లో రైతులు వరి సాగు వైపు దృష్టి సారించారు. ఐఎన్‌ఆర్‌-1010 రకం వరి నాట్లను అ ధికంగా వేశారు. ఈ పంట ఎదిగి రావడానికి దాదాపు 120 రోజుల సమయం పడుతుంది. ఫి బ్రవరి చివరి వరకు ఎంజీకేఎల్‌ఐ ఆయకట్టు కింద రైతులు నాట్లు వేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో ఈ సారి కూడా రికార్డు స్థాయిలో వరద చేరడంతో పంట ఆలస్యంగా వేసినా, దిగుబడికి ఢోకా ఉండదని అన్నదాతలు ఆశించారు. అయితే, కృష్ణానది జలాల విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్ర భుత్వాలు పోటాపోటీగా విద్యుత్‌, సాగునీటి అవసరాలకు నీటిని వినియోగించడంతో అనూహ్యంగా శ్రీశైలం డెడ్‌ స్టోరేజ్‌కు చేరింది. దీని వల్ల తాగునీటి అవసరాలకు తప్ప, ఇతరత్రా అవసరాలకు కృష్ణా జలాలను మళ్లించే అవకాశం లేకపోవడంతో, జిల్లాలో ఎంజీకేఎల్‌ఐ ఉన్నా రైతాంగానికి సమస్యాత్మకంగా పరిణమించింది. ఈ సీజన్‌లో ప్రధానంగా సాగు చేసిన వరి పంట కేవలం 30-50 శాతం మేరకు చేతికి రాగా, మే 2వ వారంలోగా పూర్తి స్థాయిలో వరికోతలు ముగియాలంటే ఇంకా కనీసం 4-5 తడులు నీరు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎంజీకే ఎల్‌ఐ కాలువల ద్వారా నీటి పంపింగ్‌ ప్రక్రియ నిలిచిపోవడంతో రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-04-23T04:51:25+05:30 IST