రైతుల ఉసురుతో ప్రభుత్వాల పతనం ఖాయం

ABN , First Publish Date - 2020-11-29T06:03:41+05:30 IST

వ్యవసాయాన్ని దెబ్బతీసేలా నల్లచట్టాలను చేసి, అన్నదాతల ఉసురుపోసుకుంటేప్రభుత్వాల పతనం ఖాయమని సీపీఐ, రైతు సంఘాలనాయకులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ, విద్యుత్‌ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా చలో ఢిల్లీకి వెళ్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం జల ఫిరంగులతో అడ్డుకోవడాన్ని నిరసించారు.

రైతుల ఉసురుతో ప్రభుత్వాల పతనం ఖాయం
నిరసన తెలుపుతున్న రైతుసంఘం నాయకులు

సీపీఐ, రైతుసంఘాల నేతల హెచ్చరిక..

అన్నదాతలపై లాఠీచార్జికి నిరసన

అనంతపురం క్లాక్‌టవర్‌, నవంబరు 28: వ్యవసాయాన్ని దెబ్బతీసేలా నల్లచట్టాలను చేసి, అన్నదాతల ఉసురుపోసుకుంటేప్రభుత్వాల పతనం ఖాయమని సీపీఐ, రైతు సంఘాలనాయకులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ, విద్యుత్‌ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా చలో ఢిల్లీకి వెళ్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం జల ఫిరంగులతో అడ్డుకోవడాన్ని నిరసించారు. దీనిపై శనివారం స్థానిక టవర్‌క్లాక్‌ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సీపీఐ, రైతుసంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు మల్లికార్జున, కాటమయ్య మాట్లాడుతూ దేశ ప్రజలు స్వాతంత్య్రం, స్వేచ్ఛతో జీవించాలని నాడు మహాత్మాగాంధీ.. ఆంగ్లేయులపై పోరాడి స్వాతం త్య్రం తీసుకొస్తే.. నేడు ప్రధాని మోదీ దేశ సంపదను విదేశీయులు, కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు నల్లచట్టాలను తీసుకొచ్చారని మండిపడ్డారు. దేశానికి అన్నంపెట్టే రైతులపై కర్కశంగా వ్యవహరించటం దారుణమన్నారు. అన్నదాతలపై లాఠీచార్జికి నిరసనగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో మౌనదీక్ష చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణలను సీఎం జగన్‌ రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. జీఓ నంబరు 22 ద్వారా రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి, ఉచిత విద్యుత్తును దూరం చేసే కుట్ర పన్నారని మండిపడ్డారు. దీనిపై పెద్దఎత్తున పోరాడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు వన్నారెడ్డి, బండి రామకృష్ణ, చలపతి, సీపీఐ నాయకులు రమేష్‌, హరికృష్ణ, దుర్గాప్రసాద్‌, శ్రీకాంత్‌, రాము, ధనుంజయ, రామాంజనేయులు, ప్రసాద్‌, అక్కులప్ప పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T06:03:41+05:30 IST