అన్నదాతకు ప్రజలే అండగా నిలవాలి

ABN , First Publish Date - 2020-12-03T05:40:49+05:30 IST

కేంద్రం అమల్లోకి తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఆందోళనకు ప్రజలంతా మద్దతు తెలపాలని పలు ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి.

అన్నదాతకు ప్రజలే అండగా నిలవాలి
ధర్నా చేస్తున్న ప్రజా సంఘాల ప్రతినిధులు

 సంఘీభావ నిరసనలో ప్రజా సంఘాల పిలుపు

సిరిపురం, డిసెంబరు 2 : కేంద్రం అమల్లోకి తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఆందోళనకు ప్రజలంతా మద్దతు తెలపాలని పలు ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. రైతుల నిరసనకు సంఘీభావంగా పలు ప్రజాసంఘాలు బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీ నడిబొడ్డున పంజాబ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌ రైతులు ఆందోళన చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.


రైతుల ఆందోళనకు అన్నివర్గాల ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. రైతుల వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తక్షణం ఆ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సంఘాల సమన్వయకర్త పి.చంద్రశేఖర్‌ అధ్యక్షతన జరిగిన ఆందోళనలో పలు ప్రజా సంఘాల ప్రతినిధులు బి.వెంకటరావు, జి.రాంబాబు, ఎ.విమల, ఎ.దేముడమ్మ, ఇన్సాఫ్‌ ఎస్‌.కె.రెహ్మాన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-03T05:40:49+05:30 IST