అన్నామలై క్షమాపణలు చెప్పాలి

Published: Wed, 15 Jun 2022 09:35:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అన్నామలై క్షమాపణలు చెప్పాలి

                             - మంత్రి సుబ్రమణ్యం డిమాండ్‌ 


చెన్నై, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలకు పంపిణీ చేసే పౌష్టికాహార కిట్లకు సంబంధించిన టెండర్‌ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై ఆరోపించినట్లు అనితా టెక్స్‌కాడ్‌ సంస్థకు ఖరారు చేయలేదని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం తెలిపారు. ఈ టెండర్‌ను రాష్ట్ర ప్రభుఎత్వం మంగళవారం శ్రీబాలాజీ సర్జికల్స్‌ సంస్థకు ఖరారు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో టెండర్‌ ఖరారైపోయినట్లు తప్పుడు ఆరోపణలు చేసిన అన్నామలై భేషరతుగా క్షమాపణలు తెలియజేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇకనైనా ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.