కొత్త జిల్లాగా అన్నమయ్య ప్రారంభం

ABN , First Publish Date - 2022-04-04T17:25:09+05:30 IST

రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేసిన అన్నమయ్య కొత్త జిల్లా సోమవారం నుంచి ప్రారంభమైంది.

కొత్త జిల్లాగా అన్నమయ్య ప్రారంభం

కడప జిల్లా: రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేసిన అన్నమయ్య కొత్త జిల్లా సోమవారం నుంచి  ప్రారంభమైంది. కలెక్టర్, ఎస్పీలతోపాటు పలువురు ఉన్నతాధికారులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాయచోటి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కడప జిల్లా నుంచి వేరుపడుతున్నందుకు బాధగా ఉన్నా.. మరోవైపు కొత్త జిల్లా కేంద్రంగా పరిపాలన ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన 26 జిల్లాలతో పోల్చుకుంటే.. ఇది వెనుకబడిన జిల్లా అని, తాగు, సాగునీటికి ఇబ్బందులున్న జిల్లా అని అన్నారు. ఇప్పుడు ఈ జిల్లాకు తాగు, సాగునీరు ఇస్తామని, అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. మౌలిక వసతుల కల్పన.. ఇలా అన్నిరకాల్లో కలిసి ముందుకు వెళతామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-04T17:25:09+05:30 IST