అమరావతి: అన్నపూర్ణ లాంటి ఏపీని సారాపూర్ణగా మార్చారని ఎమ్మెల్సీ దొరబాబు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సారా మరణాలపై న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. న్యాయవిచారణ కోసం అసెంబ్లీలో పట్టుబడతామని చెప్పారు. ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి సొంత నియోజకవర్గంలోనూ.. కల్తీమద్యం, నాటుసారా అదుపు చేయడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. మంత్రి నారాయణస్వామి రాజీనామా చేయాలని దొరబాబు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి