అన్నారంలో ఉర్సు ప్రారంభం

ABN , First Publish Date - 2021-03-01T05:04:37+05:30 IST

అన్నారంలో ఉర్సు ప్రారంభం

అన్నారంలో ఉర్సు ప్రారంభం
చాదర్‌ సమర్పిస్తున్న ఎమ్మెల్యే, ముజావర్లు

పర్వతగిరి, ఫిబ్రవరి 28: పర్వతగిరి మండలంలోని అన్నా రంషరీఫ్‌లో యాకూబ్‌షావళి బాబాదర్గా ఉర్సు ఆదివారం రాత్రి ప్రారంభమైంది. యాకూబ్‌షావళి దర్గాతోపాటు మహ బూబీమా, గుంశావళీ, బోలేషావళి, గౌస్‌పాక్‌ దర్గాలను రం గురంగుల విద్యుద్ధీపాలతో అలంకరించారు. ముజావర్లు గౌస్‌పాషా ఇంటివద్ద గంధంకు పూజలు నిర్వహించి ఊరేగిం పుగా తీసుకువచ్చారు. ఎమ్మెల్యే అరూరి రమేష్‌ హాజరై గం ధంకుపూజలు నిర్వహించారు. ఫకీర్ల విన్యాసాల నడుమ గంధం యాకూబ్‌షావళి బాబాకు సమర్పించారు. అనంత రం చాదర్‌ సమర్పించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ను ఏర్పాటుచేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా వక్ఫ్‌బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు. 

ప్రశాంతంగా జరగాలి : డీసీపీ

అన్నారం షరీఫ్‌ ఉర్సు ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఈస్ట్‌జోన్‌ డీసీపీ వెంక టలక్ష్మి సూచించారు. ఆది వారం అన్నారం షరీఫ్‌దర్గా పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రూ.4లక్షల విలువైన 30సీసీ కెమెరాలను ప్రారంభిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడు తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవా లన్నారు. భక్తుల సౌకర్యార్థం కంట్రోల్‌ రూం నుంచి సూచ నలు చేస్తూ ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చేయాలన్నారు. 150మంది పోలీసులు ఉత్సవాలకు బందోబస్తు నిర్వహిస్తార న్నారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 డయల్‌ చేయాలని కోరారు. సమావేశంలో మామూనూర్‌ ఏసీపీ నరే ష్‌కుమార్‌, సీఐ కిషన్‌, ఎస్‌ఐ ప్రశాంత్‌బాబు, ఐనవోలు ఎస్‌ ఐ నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-01T05:04:37+05:30 IST