‘ప్రసాద్‌’ పథకంలో అన్నవరం

ABN , First Publish Date - 2021-09-17T06:42:39+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్‌ స్కీమ్‌’లో ఈ ఆలయాన్ని చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

‘ప్రసాద్‌’ పథకంలో అన్నవరం

  • కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌
  • అభివృద్ధికి భారీగా నిధులు

అన్నవరం, సెప్టంబరు 16: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్‌ స్కీమ్‌’లో ఈ ఆలయాన్ని చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఈ పథకం కింద కేంద్ర టూరిజం శాఖ అనుమతులు ఇస్తోంది. ఇప్పటికే శ్రీశైలం దేవస్థానానికి ఈ పథకంలో నిధులు మంజూరు చేయగా, ఆ మేరకు పనులు కూడా పూర్తయ్యాయి. అలాగే సింహాచలం ఆలయానికి కూడా గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. మూడేళ్ల కిందట అన్నవరం ఆలయంలో ఈ పథకం ద్వారా సుమారు రూ.48.58 కోట్లతో ప్రతిపాదనలు పంపగా కొన్ని సాంకేతిక కారణాలతో నిధులు మంజూరుకాలేదు. దీంతో కాకినాడ ఎంపీ వంగా గీత, స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి, కేంద్రం వద్దకు తీసుకెళ్లడంతో ‘ప్రసాద్‌ స్కీమ్‌’లో చేర్చింది. దీంతో ఆలయం గతంలో ప్రతిపాదించిన పనులకు సంబంధించి నిధుల కేటాయింపులు జరగనున్నాయి. ఈ మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని, తమ వద్ద ఉన్న అన్ని అనుమతులను క్లియర్‌ చేశామని ఆ ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది.

Updated Date - 2021-09-17T06:42:39+05:30 IST