అన్నవరం దేవస్థానంలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-08-09T11:21:13+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో కరోనా కలకలం రేపుతుంది.

అన్నవరం దేవస్థానంలో కరోనా కలకలం

39 మంది ఉద్యోగులకు కొవిడ్‌ పాజిటివ్‌

నేటి నుంచి 14 వరకు దర్శనాలు నిలుపుదల


అన్నవరం, ఆగస్టు 8: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో కరోనా కలకలం రేపుతుంది. శనివారం 300 మందికి నిర్వహించిన పరీక్షల్లో 39 మందికి కరోనా మహమ్మారి సోకడంతో ఒక్కసారిగా అలజడి నెలకొంది. దీంతో ఈవో త్రినాథ రావు దేవదాయశాఖ అధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందిం చారు. దీంతో భక్తులకు దర్శనాలు నిలుపుదల చేయమని ఆదేశించడంతో నేటినుంచి ఈనెల 14 వరకు దర్శనాలు నిలుపుదల చేయనున్నట్టు ఈవో త్రినాథరావు తెలిపారు. ఇప్పటికే 12 మంది ఉద్యోగులకు కరోనా సోకగా తాజాగా వెల్లడైన ఫలితాలతో ఈ సంఖ్య 49కి చేరింది. దేవస్థానంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 700మంది పని చేస్తుం డగా శనివారం 300 మందికి సత్యగిరిపై హరిహరసదన్‌లో కొవిడ్‌ పరీక్షలు నిర్వహిం చారు. మిగిలినవారికి త్వరలోనే పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కరోనా సోకినవారిలో అధికంగా వ్రత పురోహితులు, అర్చకులు ఉండడం విశేషం.

Updated Date - 2020-08-09T11:21:13+05:30 IST