ఘనంగా ఏపీయూడబ్ల్యూజే వార్షికోత్సవం

ABN , First Publish Date - 2022-08-18T06:13:57+05:30 IST

ఎమ్మిగనూరులో ఏపీయూడబ్ల్యూజే 65వ వార్షికోత్సవాన్ని బుదవారం సంఘం నాయకులు పరమేశ్వర అధ్య క్షతన ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ఏపీయూడబ్ల్యూజే వార్షికోత్సవం
రక్తదానం చేస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణ

ఎమ్మిగనూరు, ఆగస్టు 17: ఎమ్మిగనూరులో ఏపీయూడబ్ల్యూజే 65వ వార్షికోత్సవాన్ని బుదవారం  సంఘం నాయకులు పరమేశ్వర అధ్య క్షతన ఘనంగా నిర్వహించారు. స్థానిక సోమప్ప సర్కిల్‌లో ఏర్పాటు చేసిన జెండాను జిల్లా అడహాక్‌ కమిటీ సభ్యుడు శ్రీనివాసనాయుడు ఎగురవేశారు. గతంలో మృతిచెందిన విలేకరులు మహ్మద్‌ గౌస్‌, మురళి, గిరిబాబు, సాయి శ్రీనివాస్‌, మెట్రో శ్రీనివాసులు, గోవర్ధన్‌, పామిడిలో హత్యకు గురైన వేణుగోపాల్‌లను స్మరిస్తు రెండునిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు.  అనంతరం  పాత తహసీల్దార్‌ కార్యాల యం ఆవరణలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ముఖ్య అతిఽథులుగా హాజరైన తహసీల్దార్‌ జయన్న, మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణ ప్రారంభిం చారు.  కమిషనర్‌ కృష్ణ మాట్లాడుతూ రక్తదానం చేసి యువకులను అం దరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. అనంతరం 21 మంది పాత్రికే యులు, యువకులు రక్తదానం చేశారు.  ఈ  కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసనాయుడు, హేమంత్‌, శరత్‌, నూర, భీమన్న, బొగ్గుల శివయ్య, వి రామకృష్ణ, రవి, కౌన్సిలర్‌ వీజీయే దయాసాగర్‌, మాజీ కౌన్సిలర్లు మధుబాబు, రామకృష్ణ నాయుడు, యాపిల్‌ ల్యాబ్‌ భీరప్ప పాల్గొన్నారు.  మగ్బుల్‌, నాగరాజు నాయుడు, రామకృష్ణ, ఆవుల శ్రీనివాసులు, బాబురాజు పాల్గొన్నారు.

కోసిగి: ఏపీయూడబ్ల్యూజే 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏపీ యుడబ్ల్యూజే అడ్‌హక్‌ కమిటీ నాయకులు గడ్డం వీరన్న, ఆంధ్రజ్యోతి హనుమేష్‌, షబ్బీర్‌, శ్రీరాములు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కోసిగిలోని ప్రభుత్వ వైద్యశాలలో డా.ప్రతిభ నేతృత్వంలో బాలింతలు, గర్భిణులకు పండ్లు, బెడ్ర్లు పంపిణీ చేశారు. అలాగే రేణుకాదేవి ఎల్లమ్మ మైదానంలో ఉన్న అనాథలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు ప్రదీప్‌ కుమార్‌, రాజేష్‌, నాగరాజు, కర్రెప్ప, అగసనూరు నాగరాజు, సతీష్‌, ప్రవీణ్‌, యుసుఫ్‌, మధు, మహమ్మద్‌, ప్రభాకర్‌, రఘు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-18T06:13:57+05:30 IST