ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2021-09-19T04:34:37+05:30 IST

షెడ్యూల్డ్‌ కుల స్థులకు మద్యం షాపుల్లో రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీపీ సౌందర్య, జడ్పీటీసీ సంతోష్‌ ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం
రెబ్బెనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు

రెబ్బెన, సెప్టెంబరు 18: షెడ్యూల్డ్‌ కుల స్థులకు మద్యం షాపుల్లో  రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీపీ సౌందర్య, జడ్పీటీసీ సంతోష్‌ ఆధ్వర్యంలో  శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మద్యం షాపుల్లో గౌడ కులస్థులు, ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ  ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ నిర్ణయం త్వరలో జరగబోయే మద్యం టెండర్ల నుంచే అమల్లోకి రానుందన్నారు. ఈ మేరకు గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం చొప్పున షాప ులను కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శంకర్‌, రాజేష్‌, భరద్వాజ్‌, రాజేష్‌, బయ్య, వస్రం నాయక్‌, విమలేష్‌, ఆశన్న, మోహన్‌, లోకేష్‌, రజినీకాంత్‌ పాల్గొన్నారు.
దహెగాం: మండలకేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి శనివారం గౌడకులస్థులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ ఎస్‌ మండల కన్వీనర్‌ సంతోష్‌గౌడ్‌, దామోదర్‌గౌడ్‌, మహేష్‌గౌడ్‌, రాజాగౌడ్‌, నాయకులు ప్రసాద్‌రాజు, వెంకన్న, పాపన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T04:34:37+05:30 IST