జిల్లాలో మరో 102 మందికి కొవిడ్‌ పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-09-22T06:02:38+05:30 IST

జిల్లాలో కొత్తగా మరో 102 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ

జిల్లాలో మరో 102 మందికి కొవిడ్‌ పాజిటివ్‌

చికిత్స పొందుతూ ముగ్గురు మృతి  డీఈవో కార్యాలయంలో కలకలం 


కరీంనగర్‌, సెప్టెంబర్‌ 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కొత్తగా మరో 102 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా సుమారు 300 మంది వరకు వ్యాధిబారిన పడినట్లు అనధికారిక సమాచారం. ముగ్గురు కరోనా బారినపడి చికిత్సపొందుతూ మృతిచెందారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలోని వివిధ శాఖల కార్యాలయా ల్లో ఇప్పటికే పలువురు అధికారులు, ఉద్యోగులు కరోనా బారిన పడగా, తాజాగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఒకరికి పాజిటివ్‌ రావడం కలకలం రేపింది. విద్యాశాఖ కార్యాలయాన్ని పూర్తిగా హైపో క్లోరైడ్‌ ద్రావణంతో శానిటైజేషన్‌ చేయించారు. సోమ వారం చొప్పదండి మండలానికి చెందిన 80 సంవత్స రాల వృద్ధుడు కరోనా బారినపడి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెం దాడు.  రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన 52 సంవత్సరాల వ్యక్తికి ఈనెల 19న కరోనా నిర్ధారణ కావడంతో హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నాడు. సోమవారం ఆయనకు శ్వాసతీసుకు నేందుకు ఇబ్బందిపడడంతో ఆయనను కరీంనగర్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించారు.


అలాగే కరీంనగర్‌ పట్టణంలోని ముకరంపురకు చెందిన 65 సంవ త్సరాల మహిళ ప్రైవేట్‌ ఆసుపత్రులో మృతిచెం దింది. ఇక స్థానికుల సమాచారం మేరకు సోమ వారం హుజురాబాద్‌ డివిజన్‌పరిధిలోని జమ్మికుంట మండలంలో 29, హుజురాబాద్‌ మండలంలో 25, శంకరపట్నం మండలంలో 6, వీణవంకమండలంలో 6, ఇల్లందకుంట మండలంలో 5, సైదాపూర్‌ మండ లంలో 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరీం నగర్‌ డివిజన్‌ పరిధిలోని మానకొండూర్‌ మండ లంలో 12 మంది, తిమ్మాపూర్‌లో ఆరుగురు, కొత్తప ల్లి మండలంలో 13 మంది, కరీంనగర్‌ రూరల్‌ మండలంలో తొమ్మిది మంది, గన్నేరువరం మండ లంలో ఒకరు, రామడుగు మండలంలో ఐదుగురు, గంగాధర మండలంలో 20 మంది, చొప్పదండి మం డలంలో 16 మంది, చిగురుమామిడిలో ఏడు గురు కొవిడ్‌ వ్యాధి బారినపడ్డారు. కరీంనగర్‌ పట్టణంలోని పద్మనగర్‌లో ముగ్గురు, సుభాష్‌నగర్‌లో ఐదుగురు, శివాజీనగర్‌లో ఒకరు, వావిలాలపల్లిలో ఒకరు, ఇంది రానగర్‌లో ఒకరు, తీగలగుట్టపల్లిలో ఒకరు, గణేశ్‌న గర్‌లో ఒకరు, తిరుమల్‌నగర్‌లో ఒకరు, కట్టరాంపూర్‌ లో ఐదుగురు, భగత్‌నగర్‌లో ఒకరు, రేకుర్తిలో ము గ్గురు, సీతారాంపూర్‌లో ఇద్దరు, లక్ష్మీనగర్‌లో ఇద్దరు, కాపువాడలో ఇద్దరు, రాఘవేం ద్రనగర్‌లో ఒకరు, బోయవాడలో ఒకరు, మారుతీనగర్‌లో ఒకరికి కరో నా వ్యాధి సోకింది. అలాగే నగరంలోని వివిధ డివి జన్లకు చెందిన మరో 50 మంది వరకు ప్రైవేట్‌ ఆసు పత్రుల్లో సీటీ స్కాన్‌ చేసుకొని హోంఐసోలేషన్‌, హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.  

Updated Date - 2020-09-22T06:02:38+05:30 IST