మరో 404కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-10-25T10:50:55+05:30 IST

జిల్లాలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచీ శనివారం ఉదయం 9 గంటల వరకూ మరో 404 మందికి కరోనా..

మరో 404కరోనా కేసులు

తిరుపతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచీ శనివారం ఉదయం 9 గంటల వరకూ మరో 404 మందికి కరోనా సోకినట్టు అధికార యంత్రాంగం నిర్ధారించింది. తిరుపతి నగరంలో 78, మదనపల్లెలో 37, చిత్తూరులో 33, తిరుపతి రూరల్‌ మండలంలో 18, పుంగనూరులో 12, పలమనేరు, నారాయణవనం, ఎర్రావారిపాళ్యం మండలాల్లో 11 చొప్పున, పుత్తూరు, పీటీఎం, వాల్మీకిపురం మండలాల్లో 10 వంతున, కుప్పం, ఐరాల, కలికిరి మండలాల్లో 9 వంతున, పాకాలలో 8, పీలేరు, రామసముద్రం, సదుం మండలాల్లో 7 చొప్పున, శ్రీకాళహస్తి, శాంతిపురం మండలాల్లో 6 చొప్పున, గుడిపాల, ములకలచెరువు, సత్యవేడు మండలాల్లో 5 వంతున, చంద్రగిరి, జీడీ నెల్లూరు, కేవీపల్లె, రామచంద్రాపురం, రేణిగుంట, రొంపిచెర్ల, తంబళ్ళపల్లె, వడమాలపేట, వి.కోట మండలాల్లో 4 వంతున, నగరి, బంగారుపాళ్యం, పెద్దపంజాణి, పూతలపట్టు, వరదయ్యపాళ్యం మండలాల్లో 3 వంతున, బి.కొత్తకోట, గంగవరం, గుర్రంకొండ, కేవీబీపురం, సోమల, వెదురుకుప్పం, ఏర్పేడు మండలాల్లో 2 చొప్పున, బైరెడ్డిపల్లె, బీఎన్‌ కండ్రిగ, చౌడేపల్లె, గుడుపల్లె, కలకడ, కార్వేటినగరం, నిమ్మనపల్లె, పులిచెర్ల, తవణంపల్లె, తొట్టంబేడు మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా పాజిటివ్‌ల సంఖ్య 78756కు చేరుకుంది.వైరస్‌తో పోరాడుతూ మరో నలుగురు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 760కి చేరింది.


కొవిడ్‌ సెంటర్లలో 2803 పడకల ఖాళీ 

తిరుపతిలో ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో రాత్రి 11  గంటల వరకు 2,803 పడకలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 2,548 సాధారణ, 255 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉన్నాయి. సాధారణ పడకలకు సంబంధించి రుయాలో 267, స్విమ్స్‌ 270, ఈఎస్‌ఐలో  79,  మాధవంలో 500, పద్మావతి నిలయంలో 437, శ్రీనివాసంలో 965, టీటీడీ ఉద్యోగులకు 30, ఖాళీగా ఉన్నాయి. ఇక ఆక్సిజన్‌ బెడ్స్‌ రుయాలో 168, ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 32  అందుబాటులో ఉన్నాయి.  ఐసీయూలో  బెడ్స్‌ రుయాలో 14, ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 41 అందుబాటులో ఉన్నాయి.   

Updated Date - 2020-10-25T10:50:55+05:30 IST