
జో బిడెన్ మరో ప్రతినిధికి పాజిటివ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడి అధికార నివాసమైన వైట్ హౌస్‌లో మరోసారి కరోనా కలకలం రేపింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో కలిసి బ్రస్సెల్స్, పోలాండ్ దేశాల్లో పర్యటించి తిరిగి అమెరికా వచ్చిన అధికార మహిళా ప్రతినిధి కరీన్ జీన్ పియర్‌కు కొవిడ్ పాజిటివ్ అని తేలింది.అయితే కొవిడ్ టీకాలు వేయించుకున్న జో బిడెన్ కు మాత్రం ఎలాంటి కరోనా ముప్పు లేదని జీన్ పియర్ చెప్పారు.‘‘నేను పీసీఆర్ పరీక్షల చేయించుకోగా కరోనా పాజిటివ్ అని వచ్చింది. అధ్యక్షుడితో జరిపిన సమావేశంలో నేను సామాజిక దూరం పాటించాను’’ అని జీన్ పియర్ చెప్పారు.
తనకు కరోనా తేలికపాటి లక్షణాలున్నాయని పియర్ పేర్కొన్నారు. బెల్జియం, పోలాండ్ దేశాల్లో బిడెన్ తోపాటు ఉక్రేనియన్ శరణార్ధులతో జరిగిన సమావేశాల్లో జీన్ పియర్ పాల్గొన్నారు. తన అధికార ప్రతినిధికి కొవిడ్ సోకడంతో జో బిడెన్ ఐర్లాండు ప్రధానమంత్రి మైఖేల్ మార్టిన్ తో జరిగిన సమావేశం నుంచి ఆకస్మాత్తుగా నిష్క్రమించారు.గతంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ భర్తకు కూడా కరోనా వచ్చింది.
ఇవి కూడా చదవండి