మరొక్క ఛాన్స్‌

ABN , First Publish Date - 2020-09-30T06:23:21+05:30 IST

జిల్లాలోని మున్సిపల్‌ ప్రాంతాల్లో.. ఆస్తి పన్ను బకాయిదారులకు ఇది ఊరట లాంటిదే. బకాయి దారులలో ఈనెల 15లోగా

మరొక్క ఛాన్స్‌

ఆస్తిపన్ను బకాయిదారులకు ఊరట

అక్టోబర్‌ 31వ తేదీ వరకు గడువు పెంపు

జిల్లాలోని మూడు మున్పిపాలిటీల పరిధిలో  వర్తింపు 

మొత్తం రూ.3.86 కోట్ల వరకు లక్ష్యం

90 శాతం మాఫీతో రూ.1.40 లక్షల వరకు వసూలు

నియోజకవర్గాల్లో స్పెషల్‌ డ్రైవ్‌లతో అధికారులు బిజీబిజీ


కామారెడ్డి, సెప్టెంబరు 29 : జిల్లాలోని మున్సిపల్‌ ప్రాంతాల్లో.. ఆస్తి పన్ను బకాయిదారులకు ఇది ఊరట లాంటిదే. బకాయి దారులలో ఈనెల 15లోగా చెల్లించిన వారికి 90శాతం వడ్డీ మాఫీ చేయనున్న గడువును ప్రభుత్వం పొడగిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్‌ 31వరకు ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో సుమారు రూ.3.86 కోట్ల బకాయిల కు ప్రభుత్వం నూతనంగా 90 శాతం మాఫీ అవకాశం కింద ఇప్పటికి రూ.1.40 లక్షల వరకు వసూలు అయినట్లు సంబంధిత అధికార వర్గా లు పేర్కొంటున్నాయి. అక్టోబర్‌ 31వరకు అవకాశం ఉండడం వల్ల బకా యిలు వందశాతం వసూలుకు అవకాశం దొరికింది. జిల్లాలో కామా రెడ్డి, బాన్స్‌వాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రతినెలా మున్సి పల్‌ రికార్డుల ప్రకారం ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు. అయితే వాణి జ్య, వ్యాపార, గృహ నిర్మాణాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


ప్రస్తుతం ప్రతినెలా బకాయిలు పేరుక పోయిన దుస్థితి జిల్లాలో నెల కొంది. ఆస్తిపన్ను మీద ఉన్న బకాయిలపై వడ్డీతో ప్రతీ ము న్సిపాలిటీల్లో నెలవారి వసూలు లక్ష్యం సిబ్బందికి గుదిబండగా మారింది. ఈ క్రమంలో మొండి బకాయిల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం నూతన ఆలోచ నకు శ్రీకారం చుట్టింది. దీంతో ఆస్తిపన్నును నిర్దేశించిన గడువులోగా చెల్లించిన వారికి వడ్డీపై 90శాతం మాఫీ ఇస్తూ ప్రభుత్వం నూతన ఉత్తర్వులను ఆగస్టులో జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి బకాయిలను వసూలు చేసే దిశగా అడుగులు వేసింది. నిర్ణీత గడువు ఈనెల 15తో ముగిసింది. అయితే ఆ గడువును ప్రభుత్వం అక్టోబర్‌ 31వ తేదీ  వరకు పొడగించింది.


వందశాతం లక్ష్యంగా ‘ స్పెషల్‌ డ్రైవ్‌’

జిల్లాలో ఆస్తిపన్ను వంద శాతం వసూలు కోసం ప్రభుత్వ ఉత్తర్వులను మున్సిపల్‌ అధికారులకు సమర్థవంతంగా స్వీకరిస్తున్నారు. అక్టోబర్‌ 31వ తేదీ వరకు ఇవ్వ డంతో ఆయా మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిలపై మరింత దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే రూ.90 లక్షలను వసూలు చేసిన మున్సిపల్‌ అధికారులు వంద శాతం వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టడానికి చర్యలు తీసు కుంటున్నారు. పూర్తిగా ఆస్తిపన్ను బకాయిలు చెల్లించిన వారికి వడ్డీపై 90 శాతం మాఫీ అవకాశం ప్రచారం చేస్తు అక్టోబర్‌ 31 వరకు ఆస్తి పన్ను లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు. 


మూడు మున్సిపాలిటీలో రూ.3.86 కోట్ల లక్ష్యం

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో గృహ, వాణిజ్య సము దాయలతో పాటు తదితర ఆస్తుల పన్నులు మొత్తం రూ.3.86 కోట్ల లక్ష్యం కాగా కామారెడ్డిలో రూ.2కోట్ల 35 లక్షలు ఉండగా అందులో రూ.కోటీ 30లక్షలకు పైగా ఆస్తిపన్ను వసూలు అయింది. బాన్స్‌వాడలో రూ.97 లక్షలకు గాను రూ.మూడు లక్షలకు పైగానే వసూలు అయి నట్లు సమాచారం. ఎల్లారెడ్డిలో మాత్రం రూ.53 లక్షల పన్ను లక్ష్యం ఉండగా.. అక్కడ అంతంతమాత్రంగానే పన్ను వసూలు అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ఆయా మున్సి పాలిటీల్లోని ప్రజలు వినియోగించుకుంటే మరింత ఆదాయం సమ కూరడంతో పాటు ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.


అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జానయ్య, ఆర్‌ఐ, కామారెడ్డి

కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో రూ.2 కోట్లకు పైగా ఆస్తిపన్ను బకాయిల లక్ష్యం ఉండగా ప్రభుత్వం కల్పించిన 90 శాతం మాఫీ అవకాశంతో రూ.కోటీ 30 లక్షల వరకు పన్ను వసూలు అయ్యింది. మరోసారి అక్టోబర్‌ 31వ తేదీ వరకు గడువును ప్రభుత్వం పొడగించిన సందర్భంగా ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

Updated Date - 2020-09-30T06:23:21+05:30 IST