ఆగస్టు నాటికి మరో వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-04-22T07:43:39+05:30 IST

ఆగస్టు నాటికి మనదేశంలో మరో కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లోని బయోలాజికల్‌ ఇ (బీఈ) సంస్థ దీన్ని తయారుచేయనుంది...

ఆగస్టు నాటికి మరో వ్యాక్సిన్‌

  • సిద్ధం చేస్తున్న హైదరాబాద్‌ 
  • కంపెనీ బయోలాజికల్‌ ఇ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21: ఆగస్టు నాటికి మనదేశంలో మరో కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లోని బయోలాజికల్‌ ఇ (బీఈ) సంస్థ దీన్ని తయారుచేయనుంది. ప్రస్తుతం మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తయ్యాయి. త్వరలో మూడో దశ ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయి. నెలకు 7 కోట్ల వ్యాక్సిన్‌లు ఉత్పత్తిచేయగల సామర్థ్యం ఈ కంపెనీకి ఉన్నందువల్ల ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం చాలా కీలక పరిణామం అవుతుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే కౌల్‌ అన్నారు. దీంతోపాటు క్వాడ్‌ వ్యాక్సిన్‌ పార్టనర్‌షి్‌పలో భాగంగా అమెరికాలోని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ను కూడా బీఈ ఉత్పత్తి చేయనుంది. ఈమేరకు వైట్‌ హౌస్‌ ఒక ప్రకటనను విడుదల చేసింది. 2022 డిసెంబరు నాటికి బీఈ ద్వారా 100 కోట్ల డోసులను ఉత్పత్తి చేయడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. డెవల్‌పమెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సహకారంతో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నారు. బీఈ వ్యాక్సిన్‌తోపాటు త్వరలోనే మరికొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌ కూడా ఆగస్టు నాటికి అందుబాటులోకి రావచ్చు. అమెరికా కంపెనీ నోవావ్యాక్స్‌, మనదేశంలోని సీరం ఇనిస్టిట్యూట్‌ కలిసి సెప్టెంబరుకు మరో వ్యాక్సిన్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తోన్న ము క్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌ అక్టోబరులో అందుబాటులోకి రావచ్చు.


Updated Date - 2021-04-22T07:43:39+05:30 IST