మరో ఫ్యామిలీ డ్రామా

Published: Tue, 24 May 2022 00:36:12 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మరో ఫ్యామిలీ డ్రామా

కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్స్‌... బొమ్మరిల్లు భాస్కర్‌. ఆయన కథలన్నీ ఇంటిల్లిపాదీ చూసేలా ఉంటాయి. ఇటీవల ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’తో ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నారాయన. ఇప్పుడు నాగచైతన్య కోసం ఓ కథ సిద్ధం చేశారని సమాచారం అందుతోంది. ఫ్యామిలీ డ్రామాలకు చైతన్య చక్కగా సరిపోతారు. అందుకే ఈ కాంబోపై ఆసక్తి మొదలైపోయింది. ప్రస్తుతం విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ‘ధ్యాంక్యూ’ అనే చిత్రం చేశారు చైతూ. త్వరలోనే విడుదల కానుంది. బుధవారం ‘ధ్యాంక్యూ’ ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. అమీర్‌ ఖాన్‌తో కలిసి ఓ బాలీవుడ్‌ చిత్రంలో నటించారు చైతూ. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇవన్నీ అయ్యాకే... భాస్కర్‌ చిత్రం పట్టాలెక్కవచ్చు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించే అవకాశాలున్నాయి. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International