ltrScrptTheme3

మరో నాలుగు నెలలు ఉచిత బియ్యం

Nov 25 2021 @ 01:00AM

కేంద్ర మంత్రివర్గం నిర్ణయం

మార్చి వరకూ కార్డుదారులకు కేంద్రం కోటా

ఒంగోలు (కలెక్టరేట్‌), నవంబరు 24 : జిల్లాలో తెల్లరేషన్‌ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం మరో నాలుగు నెలలపాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుంది.  కరోనా విపత్కర పరిస్థితుల్లో మార్చి నుంచి కేంద్రప్రభుత్వం కార్డుదారులకు ఉచితంగా రేషన్‌ పంపిణీ చేస్తున్న విషయం విదితమే. అయితే మార్చిలో ఉచితంగా ప్రకటించిన బియ్యం పంపిణీ నవంబరుతో ముగిసింది. ఈ నేపథ్యంలో మరో నాలుగు నెలలపాటు బియ్యం పంపిణీని పొడిగిస్తూ కేంద్రమంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం వచ్చే ఏడాది మార్చి వరకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగనుంది. జిల్లాలో 9,83,340 తెల్లరేషన్‌ కార్డుదారులు ఉండగా ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా రేషన్‌ అందించ నున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.