ప్లీజ్ ఒప్పుకో.. అంటూ బతిమిలాడినా ఆ స్నేహితుడు శృంగారానికి ఒప్పుకోలేదని ఓ కుర్రాడు చేసిన ఘోరమిది..!

ABN , First Publish Date - 2021-10-30T03:39:37+05:30 IST

నవీ ముంబైకి చెందిన విజయ్‌ మస్కే (27), రూపేష్ (30) అనే వ్యక్తులు మంచి స్నేహితులు. ఇద్దరికీ మద్యం సేవించే అలవాటు ఉంది. కలిసినప్పుడల్లా విజయ్.. తనకున్న విచిత్రమైన కామ కోరికలపై రూపేష్‌తో చర్చిస్తూ ఉండేవాడు.

ప్లీజ్ ఒప్పుకో.. అంటూ బతిమిలాడినా ఆ స్నేహితుడు శృంగారానికి ఒప్పుకోలేదని ఓ కుర్రాడు చేసిన ఘోరమిది..!

సామెతలు ఊరికే పుట్టవు.. ‘‘కామాతురాణాం నభయం నలజ్జ’’ అని పెద్దలు అన్నట్లుగా.. కామంతో ఉన్న వాడికి కళ్లు మూసుకుపోయి ఉంటాయి. తాము ఏం చేస్తున్నామో వారికే తెలీదు. చిన్నా.. పెద్దా, వావి.. వరసా చూడకుండా ఘాతుకానికి పాల్పడుతుంటారు. కొందరైతే మగ, ఆడా అనే తేడా కూడా చూడరు. ఆఖరికి జంతువులను కూడా వదలడం లేదు. వారి కామవాంఛ తీరకపోతే.. అవతలి వారిని ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ప్రస్తుతం ఎక్కడచూసినా ఇలాంటి వ్యక్తులు కోకొల్లలుగా ఉన్నారు. ఇలాంటి మృగాళ్ల కళ్లల్లో పడ్డవారు.. వారి చేతుల్లో నలిగిపోవడమో, లేక అదృష్టవశాత్తు తప్పించుకోవడమో జరుగుతూ ఉండడం రోజూ చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల నవీ ముంబైలో జరిగిన ఘటన ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. స్నేహితుడు శృంగారానికి ఒప్పుకోలేదని.. ఓ యువకుడు చేసిన దారుణం.. చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..


నవీ ముంబైకి చెందిన విజయ్‌ మస్కే (27), రూపేష్ (30) అనే వ్యక్తులు మంచి స్నేహితులు. ఇద్దరికీ మద్యం సేవించే అలవాటు ఉంది. కలిసినప్పుడల్లా విజయ్.. తనకున్న విచిత్రమైన కామ కోరికలపై రూపేష్‌తో చర్చిస్తూ ఉండేవాడు. రూపేష్ కూడా మద్యం సేవించి ఉండడంతో వింటూ ఉండేవాడు. ఈ క్రమంలో కరావే గ్రామంలోని కేంద్రీయ విహార్‌ వద్ద ఓ రోజు బస్సు కోసం వేచి ఉన్నారు. అప్పటికే ఫుల్‌గా మందు కొట్టి ఉన్నారు. దీంతో విజయ్‌లోని కామాంధుడు బయటికి వచ్చాడు. రూపేష్‌తో తన విచిత్రమైన కోరికను బయటపెట్టాడు. రూపేష్‌తో శృంగారం చేయాలని ఎప్పటినుంచో కోరికగా ఉందని చెప్పకొచ్చాడు. ఈ ఒక్క మాటతో రూపేష్ షాక్ అయ్యాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో విజయ్ బలవంతపెట్టాడు. అయినా రూపేష్ తిరస్కరించాడు.


తనతో శృంగారం చేసేందుకు రూపేష్ ఒప్పుకోకపోవడంతో విజయ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే ఓ బండరాయి తీసుకుని రూపేష్‌పై దాడికి తెగబడ్డాడు. ఊహించని దాడిలో తీవ్రంగా గాయపడిన రూపేష్.. అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన విజయ్, వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. తన స్నేహితుడిని ఎవరో చంపేశారు అంటూ ఏడుపు మొదలెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అయితే అక్కడి పరిస్థితులకు, విజయ్ చెబుతున్న మాటలకు పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చింది. అదుపులోకి తీసుకుని వారి స్టైల్‌‌లో విచారించడంతో నిజం మొత్తం కక్కేశాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-10-30T03:39:37+05:30 IST