టీటీడీలో మరో వివాదం.. సంచలన విషయాలు వెలుగులోకి...!

ABN , First Publish Date - 2021-08-30T15:56:17+05:30 IST

టీటీడీలో మరో వివాదం వెలుగు చూసింది....

టీటీడీలో మరో వివాదం.. సంచలన విషయాలు వెలుగులోకి...!

తిరుమల : టీటీడీలో మరో వివాదం వెలుగు చూసింది. తెలుగు రాష్ట్రాలలోని 177 కల్యాణ మండపాలను లీజుకు ఇచ్చేందుకు టీటీడీ సిద్దమైంది. దేశవ్యాప్తంగా 299 కల్యాణ మండపాలను టీటీడీ నిర్మించింది. గతంలో కల్యాణ మండపాల పరిస్థితులపై విజిలెన్స్ ఆధ్వర్యంలో టీటీడీ ఓ కమిటీని నియమించింది. విజిలెన్స్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. చాలా చోట్ల కల్యాణ మండపాలు నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు నివేదిక అందింది. కొన్ని ప్రాంతాల్లో కల్యాణ మండపాలో గేదలను మేపుతున్నట్లు ఫోటోలోతో విజిలెన్స్ సమాచారం ఇచ్చింది. విజిలెన్స్ నివేదిక మేరకు ఇకపై కల్యాణ మండపాలను నిర్మించకూడదని పుట్టా సుధాకర్ యాదవ్ నేతృత్వంలోని పాలకమండలి నిర్ణయం తీసుకుంది.


ప్రభుత్వం మారాక తిరిగి కల్యాణ మండపాల నిర్మాణానికి ఆమోదం వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 5 సంవత్సరాల కాలపరిమితితో కల్యాణ మండపాలు లీజుకు ఇచ్చేందుకు టీటీడీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక వైపు నూతన కల్యాణ మండపాలను నిర్మిస్తూ…. మరో వైపు నిర్మించిన కల్యాణ మండపాలను లీజుకు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కల్యాణ మండపాల నిర్మాణంపై నిర్దిష్టమైన విధానం తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - 2021-08-30T15:56:17+05:30 IST