మరో మేయర్‌ను కిడ్నాప్ చేసిన రష్యా సైనికులు

ABN , First Publish Date - 2022-03-13T21:56:48+05:30 IST

రష్యా వార్ క్రిమినల్స్ మరో ఉక్రేనియన్ మేయర్‌ను అపహరించుకోపోయినట్టు ఉక్రెయిన్..

మరో మేయర్‌ను కిడ్నాప్ చేసిన రష్యా సైనికులు

కీవ్: రష్యా వార్ క్రిమినల్స్ మరో ఉక్రేనియన్ మేయర్‌ను అపహరించుకోపోయినట్టు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ఆదివారంనాడు తెలిపారు. స్థానికులు సహకరించడం లేదనే కారణంగా దినిప్రోరుడ్నే సిటీ మేయర్‌ ఎవెహెన్ మట్వెయెవ్‌‌ను తిరుగుబాటుదారులు తమ వెంట తీసుకుపోయారని, భయోత్పాతం సృష్టించారని ఆరోపించారు. ఉక్రెయిన్‌పైన, ప్రజాస్వామ్యంపైన రష్యా టెర్రర్‌ను ఆపేందుకు ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ ఘటనకు కొద్గి గంటలకు ముందే మెటిలోపాల్ నగర మేయర్‌ను సైతం రష్యా సైనికులు కిడ్నాప్ చేసినట్టు ఉక్రెయిన్ ఆరోపించింది. పది మంది రష్యా ఆక్రమణదారుల బృందం మెలిటోపోల్ మేయర్ ఇవాన్ ఫెడోరోవ్‌ను కిడ్నాప్ చేసినట్టు ఉక్రెయిన్ పార్లమెంట్ ట్విట్టర్‌లో పేర్కొంది. శత్రువులకు సహకరించడానికి ఫెడరోవ్ నిరాకరించడంతో అతన్ని కిడ్నాప్ చేశారని ఒక వీడియో సందేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు.

Updated Date - 2022-03-13T21:56:48+05:30 IST