తెలుగు రాష్ట్రాల మధ్య మరో జాతీయ రహదారి

ABN , First Publish Date - 2020-10-27T11:12:32+05:30 IST

తెలంగాణలో ని కల్వకుర్తి నుంచి నాగర్‌కర్నూ ల్‌-కొల్లాపూర్‌ మీదుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆత్మకూర్‌, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ 122కిలో మీటర్ల జా తీయ రహదారి నిర్మాణానికి కేం ద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జాతీయ

తెలుగు రాష్ట్రాల మధ్య మరో జాతీయ రహదారి

అనుమతినిచ్చిన కేంద్ర ప్రభుత్వం బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి వెల్లడి


ఆమనగల్లు:  తెలంగాణలో ని కల్వకుర్తి నుంచి నాగర్‌కర్నూ ల్‌-కొల్లాపూర్‌ మీదుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆత్మకూర్‌, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ 122కిలో మీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జాతీయ బీసీ కమిషన్‌ స భ్యులు తల్లోజు ఆచారి తెలిపా రు. ఈ మేరకు జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. సోమవారం ఆచారి ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి జాతీయ రహదారికి అ నుమతినిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన జాతీయ రహదారితో హైదరాబాద్‌-తిరుపతి మధ్య 80కిలోమీటర్లు దూరం తగ్గుతుందని తెలిపారు. భారత్‌ మాల పథకం కింద చేపట్టనున్న ఈ హైవేపై సోమశిల వద్ద బ్రిడ్జి నిర్మిస్తారని ఆచారి వివరించారు.

Updated Date - 2020-10-27T11:12:32+05:30 IST