పబ్జీ మదన్ గురించి మరో షాకింగ్ విషయం...!

ABN , First Publish Date - 2021-06-21T18:47:37+05:30 IST

యూట్యూబ్‌ చానెల్‌ నిర్వహిస్తూ మహిళలు, చిన్నారుల వద్ద అసభ్యకరంగా మాట్లాడి...

పబ్జీ మదన్ గురించి మరో షాకింగ్ విషయం...!

  • భారీగా పన్ను ఎగవేసిన పబ్జీ మదన్‌


చెన్నై/అడయార్‌ : యూట్యూబ్‌ చానెల్‌ నిర్వహిస్తూ మహిళలు, చిన్నారుల వద్ద అసభ్యకరంగా మాట్లాడి, ఆ ఆడియోలను తన యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసి కోట్లాది రూపాయలను సంపాదించిన పబ్జీ మదన్‌, ఆయన భార్య కృత్తిక బ్యాంకు ఖాతాల్లో రూ.4 కోట్ల మేరకు నగదు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. అంతేకాకుండా, వీరిద్దరు కలిసి గత మూడేళ్లలో రూ.75 కోట్ల మేరకు సంపాదించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అదే సమయంలో తనకు భారీ మొత్తంలో ఆదాయం వచ్చినప్పటికీ.. ఆదాయపన్ను ఎగవేతకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో మదన్‌ దంపతుల బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను శాఖకు అప్పగించాలని పోలీసులు నిర్ణయించారు. ఇదిలావుండగా, ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరిపేందుకు మదన్‌ను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది.

Updated Date - 2021-06-21T18:47:37+05:30 IST