దుష్ట పాలన నుంచి విముక్తి కోసం మరో పోరాటం అవసరం

ABN , First Publish Date - 2022-08-15T05:15:28+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల దుష్టపాలన నుం చి ప్రజల విముక్తి కో సం మరో స్వాతంత్య్ర పోరాటం అవసరమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు.

దుష్ట పాలన నుంచి విముక్తి కోసం  మరో పోరాటం అవసరం
రాయచోటిలో నేతాజీ సర్కిల్‌ వద్ద మీడియాతో మాట్లాడుతున్న పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ నర్రెడ్డి తులసిరెడ్డి

రాయచోటిటౌన్‌, ఆగస్టు 14: కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల దుష్టపాలన నుం చి ప్రజల విముక్తి కో సం మరో స్వాతంత్య్ర పోరాటం అవసరమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఆజాదికా అమృత్‌ మ హోత్సవ్‌లో భాగంగా స్థానిక నేతాజీ సర్కిల్‌ వద్ద సుభా్‌షచంద్రబోస్‌ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధు ల త్యాగాలు, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల పోరాటాల ఫలితంగా దేశానికి వచ్చిన స్వాతంత్య్రం నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాల దుష్టపాలనతో మళ్లీ  ప్రమాదంలో పడిందన్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వంలో సబ్‌కా వికాశ్‌ బదులు సబ్‌కా వినాశ్‌ జరుగుతోందన్నారు.

ప్రధాని దేశాన్ని కార్పొరేటర్‌ శక్తులకు తాకట్టు పెడుతున్నారని, ప్రస్తుతం దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. 1947 నుంచి 2014 వరకు 67 ఏళ్లలో నెహ్రూ మొదలుకొని మన్మోహన్‌సింగ్‌ వరకు 13 మంది ప్రధానులు చేసిన అప్పు రూ.46 లక్షల కోట్లు కాగా, 2014 నుంచి 2022 వరకు కేవలం ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.109 లక్షల కోట్లకు చేరిందన్నా రు. గత ప్రభుత్వాలు సంపాదించిన ఆస్తులను మోదీ ప్రభుత్వం వరుసగా అమ్మేస్తోందని, దేశం ఆదాని ప్రైవేట్‌ లిమిటెడ్‌గా తయారైందన్నారు. ఐటీ, ఈడీ, సీబీఐ, ఎన్‌ఐఏ, విజిలెన్స్‌ లాంటి రాజ్యాంగ వ్యవస్థలన్నీ దుర్వినియోగం అవుతున్నాయన్నారు. రూపాయి విలువ దారుణంగా పడిపోయి ఆర్థిక వ్యవస్థ దివాలా దిశగా పయనిస్తోందన్నారు.

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక, సిమెంటు, నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. గడిచిన మూ డేళ్లలో రాష్ట్రం మద్యం, జూదం, గంజాయితో నిండిపోయిందన్నారు. రాష్ట్రంలో తాలిబన్‌ల పాలన, అటవిక రాజ్యం, బూతుల పురాణం నడుస్తోందని, ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దేశంలోని బీజేపీ ప్రభుత్వం పాలన, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ పాలన నుంచి ప్రజలకు విముక్తి కోసం మరోసారి స్వాతంత్య్ర పోరాటానికి ప్రజలు సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ నేతలు ఎస్‌ఎండీ గౌస్‌, మహమ్మద్‌రఫీ, మహబూబ్‌బాషా, ఖాదర్‌వలి, చెన్నక్రిష్ణ, అమర్‌నాధరెడ్డి, ఉత్తన్న, సుబ్రహ్మణ్యంశర్మ, ఖదీర్‌, వైవీ రమణమ్మ, నాగలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-15T05:15:28+05:30 IST