దద్దుర్లతో జర భద్రం!

Published: Tue, 12 May 2020 09:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
దద్దుర్లతో జర భద్రం!

ఆంధ్రజ్యోతి(12-05-2020):

కరోనా వైరస్‌ సోకినప్పుడు కనిపించే లక్షణాలకు మరికొన్ని కొత్తవి తోడయ్యాయి. అవే ‘దద్దుర్లు’! వాటి స్వభావం ఎలా ఉంటుందంటే...


మాక్యులోపాప్యూల్స్‌: చిన్నవిగా, ఉబ్బెత్తుగా కనిపించే ఎర్రని దద్దుర్లు ఇవి! ఇవి సుమారు 7 రోజుల వరకూ శరీరం మీద ఉండిపోతాయి. కరోనా ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా ఉన్న వారికి ఈ దద్దుర్లు తలెత్తుతాయి. జలుబు, దగ్గు లక్షణాలతో పాటు దద్దుర్లు కూడా కలిసి కనిపించవచ్చు.


నెటిల్‌ ర్యాష్‌: ఇవి ఉబ్బెత్తుగా కనిపించే లేత గులాబీ రంగు, తెలుపు రంగు దద్దుర్లు. ఇవి దురద పెడతాయి కూడా! ఛాతీ, పొట్ట మీద ఈ దద్దుర్లు కనిపిస్తాయి. కొంతమందిలో చేతుల మీద కూడా కనిపించవచ్చు.


బ్లిస్టర్స్‌: కరోనా పాజిటివ్‌ బాధితుల్లో చేతులు, కాళ్లు, ఒంటి మీద తలెత్తుతాయి. దురదతో కూడిన ఈ నీటి బుడగలు మధ్యవయస్కులైన కరోనా బాధితుల్లో ఎక్కువ. మిగతా కరోనా లక్షణాల కన్నా ముందే ఈ బ్లిస్టర్స్‌ కనిపించి, కనీసం 10 రోజుల పాటు వేధిస్తాయి.


నెక్రోసిస్‌ ర్యాష్‌: చర్మం మీద నెట్‌ను పోలిన దద్దుర్లు ఎరుపు లేదా నీలం రంగులో తలెత్తుతాయి. ఇలా దద్దుర్లు రంగు మారడానికి రక్తప్రసరణ లోపమే కారణం. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌తో ఆస్పత్రిపాలైన వృద్ధులైన కరోనా బాధితుల్లో ఈ లక్షణం కనిపిస్తుంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.