మరో మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-07-24T04:33:55+05:30 IST

వాతావరణశాఖ హెచ్చరి కల నేపథ్యంలో రానున్న మూడురోజులు అధికా రులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

మరో మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

- అధికారులతో సమీక్షలో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, జూలై 23: వాతావరణశాఖ హెచ్చరి కల నేపథ్యంలో రానున్న మూడురోజులు అధికా రులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలో వర్షాలు, వరదలపై చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వర్షానికి దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు రావడానికి సమయం పడుతుం దని సింగరేణి ఆధ్వర్యంలో ఉన్న రెస్క్యూటీంలు గోలే టిలో అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. వరదలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పంచాయతీ సిబ్బంది పారిశుధ్య కార్యక్రమాలు వేగవంతం చేయా లన్నారు. రెండు మూడు రోజుల్లో డెలీవరీ అయ్యే గర్భిణులను గుర్తించి ప్రమాదంలేని ప్రాంతాలకు తరలించాలని అన్నారు. ఎక్కడైతే బ్రిడ్జిలపై నుంచి నీటిప్రవాహం ఉందో అక్కడ వెం టనే టీంలను ఏర్పాటుచేసి ఫొటోలు తీసి తనకు పంపించాలన్నారు. ఒకవేళ అవస రంపడితే పునారావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి హాస్టల్స్‌ను సిద్ధం చేయాల న్నారు. వర్షంతగ్గిన తరువాత వచ్చేవారంలో పోలీసుల ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో పలు కాలనీల్లో నాలాలపై అక్రమకట్టడాలను తొలగిస్తామన్నారు. అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో విపత్తు నిర్వహణకు సంబంధించిన ట్యూబులు, తాళ్లు, లైఫ్‌ జాకెట్స్‌, లైట్స్‌ వంటివి కొనుగోలు చేసి నిలువ ఉంచుకోవాలన్నారు. కౌటాల, బెజ్జూరు, పెంచికలపేట, చింతలమానేపల్లి మండలాలకు విద్యుత్‌సరఫరా వెంటనే పునరుద్దరిం చేలా చర్యలు చేపట్టాలన్నారు. అదనపు కలెక్టర్‌లు రాజేశం, వరుణ్‌రెడ్డి, ఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర, డీఆర్వో సురేష్‌, డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు, జిల్లాలోని అన్నిశాఖల ఉన్నతాధికారులు, సింగరేణిఅధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T04:33:55+05:30 IST