కోపంతో ఉన్న వ్యక్తిని ఎలా జయించాలో చెప్పిన తుకారాం

ABN , First Publish Date - 2022-03-20T17:04:31+05:30 IST

ఈరోజు (మార్చి 20) సంత్ తుకారాం జయంతి.

కోపంతో ఉన్న వ్యక్తిని ఎలా జయించాలో చెప్పిన తుకారాం

ఈరోజు (మార్చి 20) సంత్ తుకారాం జయంతి. తుకారాం పుట్టిన తేదీకి సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మార్చి 20 తుకారం జయింతిని నిర్వహిస్తుంటారు. తుకారం 1598లో మహారాష్ట్రలో జన్మించాడని చరిత్ర చెబుతోంది. సంత్ తుకారాం గొప్ప సాధువులలో ఒకనిగా పేరొందారు. తుకారం జీవితంలో మరపురాని ఘట్టలెన్నో ఉన్నాయి. వాటిలో విలువైన జీవిత సత్యాలు కనిపిస్తాయి. తుకారాం జీవితంలోని ఒక ఉదంతం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఒకసారి అతని పొరుగింటిలోని ఒకరు తుకారాంపై కోపంతో ఊగిపోతున్నారు. వారుతుకారాంపై అసూయతో ఉన్నారు. తుకారాం కీర్తి రోజురోజుకు పెరుగుతుండటాన్ని వారు తట్టుకోలేకపోయారు.  తుకారాం రోజూ తన ఇంట్లోనే ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అతని పొరుగింటిలోని వ్యక్తి కూడా ఉపన్యాసాలు వినడానికి రోజూ వచ్చేవాడు. అతను తుకారాం చెప్పేదానిలో తప్పుల కోసం కోసం వెతుకుతూ ఉండేవాడు. 


ఒకరోజు సంత్ తుకారాం ఇంటిలోని గేదె పొరుగింటి వారి పొలంలోకి చొరబడింది. దీంతో వారి పంట నాశనమయ్యింది. దీంతో పొరుగింటి వ్యక్తికి చాలా కోపం వచ్చింది. అను కోపంతో ఊగిపోతూ తుకారాం ఇంటికి వెళ్లి అతనిని నానా దుర్భాషలాడాడు. అయినా తుకారాం స్పందించక పోవడంతో అతడికి మరింత కోపం వచ్చింది. అతను వెంటనే ఒక కర్రను తీసుకొని తుకారాంను కొట్టాడు. అయినా తుకారాం మౌనంగా వహించాడు. చివరకు అలసిపోయిన పొరుగింటాయన తన ఇంటికి వెళ్లిపోయాడు. తరువాత తుకారాం తమ ఇంటిలోని గేదె కారణంగా జరిగిన నష్టానికి క్షమాపణలు చెప్పి, ఉపన్యాసాలు వినడానికి రమ్మని ఆహ్వానించాడు. ఇదంతా చూసిన పొరుగింటాయన.. తుకారం కాళ్లపై పడి క్షమించమని అడగడం మొదలుపెట్టాడు. అయితే తుకారాం ఎదురింటాయనను లేవదీసి కావలించుకున్నాడు. ఈ ఉదంతం ద్వారా తుకారాం... కోపంతో రగిలిపోతున్న వ్యక్తిని తిరిగి కోపంతోనే జయించలేమని శాంతంతోనే జయించవచ్చని తెలిపాడు.


Updated Date - 2022-03-20T17:04:31+05:30 IST