అంతర్‌ జిల్లాల షూటింగ్‌ బాల్‌ పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-08T02:35:42+05:30 IST

మండలంలోని పెదపట్టపుపాలెం జడ్పీ హైస్కూల్‌ క్రీడామైదానంలో ఆదివారం అంతర్‌ జిల్లాల సబ్‌ జూనియర్‌ బాలబాలికల

అంతర్‌ జిల్లాల షూటింగ్‌ బాల్‌ పోటీలు ప్రారంభం
షూటింగ్‌ బాల్‌ ఆటలో తలపడుతున్న బాలుర జట్టు

ఉలవపాడు, ఆగస్టు 7: మండలంలోని పెదపట్టపుపాలెం జడ్పీ హైస్కూల్‌ క్రీడామైదానంలో ఆదివారం అంతర్‌ జిల్లాల సబ్‌ జూనియర్‌ బాలబాలికల షూటింగ్‌ బాల్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి 17 ఏళ్ల లోపు క్రీడాకారులు పాల్గొనగా, రాష్ట్ర షూటింగ్‌ బాల్‌ అసోషియేషన్‌ ప్రధాన కార్యదర్శి పరశురాముడు పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని తగ్గించేది క్రీడలేనని తెలిపారు.ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచని బాలబాలికలను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ పోటీలు రెండు రోజులపాటు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచు  జయరామ్‌, పీడీ మురళి, గ్రామ కాపు ప్రళయకావేరి రామూర్తి, ఆవుల రామూర్తి, ఆవుల జయరామ్‌, ఆవుల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-08T02:35:42+05:30 IST