అంతర్వేది ఆలయ అభివృద్ధికి రూ.8.50 కోట్లు మంజూరు

ABN , First Publish Date - 2021-03-09T06:45:14+05:30 IST

అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునఃనిర్మాణంకోసం ప్రభుత్వం రూ.8.50 కోట్లను మం జూరుచేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

అంతర్వేది ఆలయ అభివృద్ధికి రూ.8.50 కోట్లు మంజూరు

అమలాపురం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునఃనిర్మాణంకోసం ప్రభుత్వం రూ.8.50 కోట్లను మం జూరుచేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 19న అంతర్వేది ఆలయ సందర్శన, దివ్యరథం ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆలయ అభివృద్ధిని సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో సుమారు రూ.13 కోట్ల అంచనా వ్యయంతో పునఃనిర్మా ణ పనులకు నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతూ ప్రతిపాద నలు పంపించారు. అయితే వీటిని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ పరిశీలించిన తరువాత ఆలయంలో అభివృద్ధి పనుల కోసం రూ.8.50 కోట్లను మంజూరుచేస్తూ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్‌ జి.వాణీమోహన్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధాన ఆలయాన్ని హార్డ్‌ గ్రానైట్‌తో అభివృద్ధి చేసేందుకు రూ.5 కోట్లు, నాలుగు ఎకరాల్లో ఉన్న కోనేరును రూ.3.50 కోట్లతో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిధుల మంజూరు పట్ల అంతర్వేది పరిసర గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-03-09T06:45:14+05:30 IST