వరకట్నం కేసులో పోలీసుల వేధింపులు.. లంచం అడిగే వాళ్లని అతను ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-11-26T12:52:06+05:30 IST

ఒక వరకట్నం కేసులో పోలీసులు సదరు వ్యక్తిని తరుచూ వేధింపులకు గురిచేశారు. అతను వారి వేధింపులు భరించలేక వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే..

వరకట్నం కేసులో పోలీసుల వేధింపులు.. లంచం అడిగే వాళ్లని అతను ఏం చేశాడంటే..

ఒక వరకట్నం కేసులో పోలీసులు సదరు వ్యక్తిని తరుచూ వేధింపులకు గురిచేశారు. అతను వారి వేధింపులు భరించలేక వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే..


రాజస్థాన్ రాష్ట్రంలోని బుందీ నగరానికి చెందిన జీతేంద్ర(29)పై అతని భార్య వరకట్నం కేసు పెట్టింది. దీంతో జీతేంద్రని తరుచూ పోలీసుల విచారణకు పిలిచేవారు. అతడిపై ఉన్న కేసుని కొట్టివేయాలంటే తమకు కాస్త సమర్పించుకోవాల్సిందేనని వాళ్లు చెప్పడంతో జీతేంద్ర వారికి అప్పుడప్పుడూ కొంచెం డబ్బులు లంచం లాగా ఇచ్చాడు. కానీ ఆ పోలీసులు మాత్రం అతడిని వదల్లేదు. ఇంకా ఇవ్వమని అడిగేవారు. దీంతో జీతేంద్ర వారికి బుద్ధి చెప్పాలని నిర్ణియించుకున్నాడు.




తనని ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక మహిళా సీఐ లంచం పేరుతో వేధిస్తున్నారని జీతేంద్ర బుందీ నగరంలో అవినీతి నిరోధక కార్యాలయంలో (ACB - ఏసీబీ) ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ వారు ఆ పోలీసులను పట్టుకోవడానికి  వల పన్నారు. లంచం అడిగే పోలీస్ కానిస్టేబుల్ సురేశ్ చంద్రకు జీతేంద్ర ఫోన్ చేసి డబ్బులు తెచ్చానని, పోలీస్ స్టేషన్ బయటే ఉన్నానని చెప్పాడు. సురేశ్ చంద్ర వెంటనే జీతేంద్ర వద్దకు వచ్చి రూ.7 వేలు నగదు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 


ఏసీబీ అధికారులు కానిస్టేబుల్ సురేశ్ చంద్రను విచారణ చేయగా.. ఇదంగా తనచేత సీఐ అంజన చేయిస్తోందని ఒప్పుకున్నాడు. దీంతో ఏసీబీ అధికారులు సీఐ అంజనని ఆమె పోలీస్ స్టేషన్‌లోనే అరెస్టు చేయగా.. ఆమె అందరి ముందు పట్టుబడినందుకు కన్నీరు పెట్టుకుంది.

Updated Date - 2021-11-26T12:52:06+05:30 IST