పోలీసుల సంచలన రిపోర్ట్.. ఆసియన్ అమెరికన్లపై విపరీతంగా పెరిగిన దాడులు

ABN , First Publish Date - 2022-01-30T02:36:57+05:30 IST

శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ డిపార్ట్‌మెంట్ తాజాగా విడుదల చేసిన రిపోర్ట్‌ సంచలనంగా మారింది. దీనిపై నగర మేయర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

పోలీసుల సంచలన రిపోర్ట్.. ఆసియన్ అమెరికన్లపై విపరీతంగా పెరిగిన దాడులు

ఎన్నారై డెస్క్: శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ డిపార్ట్‌మెంట్ తాజాగా విడుదల చేసిన రిపోర్ట్‌ సంచలనంగా మారింది. దీనిపై నగర మేయర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


శాన్‌ ఫ్రాన్సిస్కో విడుదల చేసిన ప్రాథమిక డేటా ప్రకారం.. 2021లో ఆసియన్ అమెరికన్లు, పసిఫిక్ ద్వీపవాసులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. 2020తో పోల్చితే 2021లో ఈ దాడులు ఏకంగా 567శాతం పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. 2020లో ఈ దాడులకు సంబంధించి 9 కేసులు నమోదైతే.. వాటి సంఖ్య 2021లో 60కి పెరిగినట్టు తెలిపారు. పోలీసులు విడుదల చేసిన ఈ డేటాపై నగర మేయర్ లండన్ బ్రీడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవ లెక్కలు ఇంకా ఎక్కువే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ దాడులను ఖండించడమే కాకుండా.. వాటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. 




Updated Date - 2022-01-30T02:36:57+05:30 IST