వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-11-29T05:18:33+05:30 IST

వ్యవసాయ వ్యతిరేక, విద్యుత్‌ చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు డిమాండ్‌చేశారు.

వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
పాలకొండలో ధర్నా నిర్వహిస్తున్న సీఐటీయూ నాయకులు

పాలకొండ: వ్యవసాయ వ్యతిరేక, విద్యుత్‌ చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు డిమాండ్‌చేశారు. శనివారం పాలకొండలో కేం ద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలకు నిరసన తెలిపారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరే కంగా ఢిల్లీలో శాంతియుత ప్రదర్శన చేస్తున్న రైతులను ప్రభుత్వం లాఠీచార్జి చేయడం, బాష్పవాయుగోళాలు ప్రయోగించడాన్ని ఖండించారు. కార్యక్రమంలో కాద రాము, దూసి పాపారావు, బొడ్డేపల్లి పట్టాభి పాల్గొన్నారు. 

 భామిని: రైతు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకుండా బీజేపీ ప్రభుత్వం వారిపై దాడి చేయడం అన్యా యమని వ్యవసాయ కార్మిక జిల్లా అధ్యక్షుడు శిర్ల ప్రసాద్‌  ఆరోపించారు.  శనివారం భామినిలో రైతు సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో కె.భాస్కరరావు, ప్రసాద్‌, గంగన్న, అప్పారావు, పెంటయ్య పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-11-29T05:18:33+05:30 IST