అప్రజాస్వామిక విధానాలు సరికాదు

ABN , First Publish Date - 2021-08-03T06:46:07+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తున్నా యని డీసీసీ ప్రెసిడెంట్‌ కేతా వత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు.

అప్రజాస్వామిక విధానాలు సరికాదు
దామరచర్లలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌

డీసీసీ ప్రెసిడెంట్‌ కేతావత్‌ శంకర్‌నాయక్‌

జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టులు

ఆంధ్రజ్యోతి- న్యూస్‌నె ట్‌వర్క్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తున్నా యని డీసీసీ ప్రెసిడెంట్‌ కేతా వత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని అడ్డుకుంటా మని ప్రకటించిన కాంగ్రెస్‌ నాయకులను పోలీ సులు ఆదివారం అర్ధరాత్రి ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. ఈ సందర్బంగా శంకర్‌నాయక్‌ వన్‌టౌన్‌ పీఎస్‌ ఎదుట మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిస్తూ విపక్షాల ఫోన్‌లను ట్యాంపరింగ్‌ చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కి పెడుతుం దన్నారు. కాగా సీఎం కేసీఆర్‌ నాగార్జునసాగర్‌ పర్యటన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచే జిల్లా వ్యాప్తంగా పోలీసులు అరెస్టుల పర్వం మొదలు పెట్టారు. కాంగ్రెస్‌, బీజేపీ, ఎమ్మార్పీఎస్‌, డీఎస్పీ, దళిత సంఘాల నేతలను ముందస్తు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.  కాగా నల్లగొండలో ఎమ్మార్పీఎస్‌ నాయకుడు బంకరం శ్రీనివాస్‌తో పాటు పలువురిని స్థానిక టూటౌన్‌, పీడీఎస్‌యూ నాయకుడు ఇందూరి సాగర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శాలిగౌరారం, కేతేపల్లిలో బీజేపీ మండల అధ్యక్షులు ఆర్‌.గోపి, జమ్ము రమేష్‌ను అరెస్టు చేశారు. తిరుమలగిరి(సాగర్‌) మండలంలో కాంగ్రెస్‌ నాయకులు శాగం పెద్దిరెడ్డి, కలసాని చంద్రశేఖర్‌, మేరావత్‌ మునినాయక్‌, సీపీఎం నాయకుడు కొర్ర శంకర్‌నాయక్‌ను పోలీ సులు అరెస్టు చేశారు. కాగా నకిరేకల్‌, మునుగోడు, దేవరకొండ, చింతపల్లి, పెద్దఅడిశర్లపల్లి, నాగార్జునసాగర్‌, చిట్యాల, దామరచర్ల, కనగల్‌, గుర్రంపోడు, వేములపల్లి, హాలియా మండలాల్లో కాంగ్రెస్‌, ఇతర ప్రజాసంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వ్యక్తిగతపూచీపై విడుదల చేశారు.

Updated Date - 2021-08-03T06:46:07+05:30 IST