రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలి

ABN , First Publish Date - 2021-01-22T05:40:57+05:30 IST

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఉడుముల ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలి

బొబ్బిలి రూరల్‌, జనవరి 21: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఉడుముల ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. మండలం లోని పెంట, రంగరాయపురం, కునుకు వానివలస గ్రామాల్లో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఉడుముల ప్రసాద్‌ ఆధ్వర్యంలో గురువారం ప్రచార సభలను నిర్వహించారు. ఈ నెల 21న బొబ్బిలిలో జరిగే జిల్లా ప్రచార సభకు రైతులంతా పాల్గొని ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు తెలపాలని ఆయన సూచిం చారు. కార్మిక సంఘ ఉపాధ్యక్షుడు ఎస్‌.గోపాలం, నాయకులు త్రినాథ పాల్గొన్నారు. 

24 నుంచి జీపుజాతా, 26 న ట్రాక్టర్‌ర్యాలీ

బొబ్బిలి: రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరి స్తున్న అనేక విధానాలకు నిరసనగా ఈ నెల 24న  గుమ్మలక్ష్మీపురం నుంచి జీపుజాతాను ప్రారంభించనున్నట్లు రైతుసంఘం జిల్లా నేత రెడ్డి శ్రీరామ్మూర్తి తెలిపారు. గురువారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మూడు రోజుల కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. రైతుల పోరాటఫలితంగా నల్లచట్టాల అమలును ఏడాదిన్నరపాటు నిలుపుదల చేసేందుకు కేంద్రం ఒక మెట్టు కిందికి దిగిందని, ఆ చట్టాలను పూర్తిగా రద్దు చేసేవరకు పోరాడేందుకు అక్కడ రైతాంగం ఉక్కుసంకల్పంతో ఉందన్నారు. వారికి అందరూ మద్దతు పలకాలని కోరారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా రైతు, వ్యవసాయకార్మిక, కౌలు రైతు, గిరిజన, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జిల్లాలో జీపుజాతా నిర్వహిస్తామన్నారు. 26న జిల్లా కే ంద్రంలో ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. రైతులు, ఇతర వర్గాలవారు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శ్రీరామ్మూర్తి పిలుపునిచ్చారు. సీపీఎం, సీఐటీయూ, రైతు సంఘాల నాయకులు రెడ్డి వేణు, శంకరరావు, బలస శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-22T05:40:57+05:30 IST