ltrScrptTheme3

‘రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి’

Oct 26 2021 @ 00:00AM

నంద్యాల, అక్టోబరు 26: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కార్మిక, రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ నాయకులు రాజశేఖర్‌, మద్దులు, సద్దాం హుసేన్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం నంద్యాలలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో 11 నెలలుగా సాగుతున్న రైతాంగ ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నా ఎలాంటి చలనం లేకపోవడం దారుణమన్నారు. విద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, పార్లమెంట్‌లో పంటలకు మద్దతు ధరాల చట్టం తీసుకురావాలని, ఉత్తర ప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఘటనలో రైతుల మరణానికి కారణమైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గౌస్‌, నాగేంద్రుడు, వెంకట్‌, నరసింహ, ఉసేని, శివ పాల్గొన్నారు. 



Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.