Gold స్మగ్లింగ్ చేసిన చీమలు.. ఏం కేసు పెట్టాలని అడుగుతున్న అధికారి

ABN , First Publish Date - 2022-06-30T01:09:19+05:30 IST

సుసాంత సింగ్ అనే ఒక ఐఎఫ్ఎస్ అధికారికి ఎదురైన వింత అనుభవం ఇంది. తన ట్విట్టర్ ఖాతాలో పదుల సంఖ్యలో గోల్డ్ చైన్‌ను ఎత్తుకెళ్తున్న చీమలకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ‘‘బుల్లి గోల్డ్ స్మగ్లర్లు.. ఇక్కడ ప్రశ్నేంటంటే.. ఈ చీమలపై ఐపీసీలోని ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి?’’..

Gold స్మగ్లింగ్ చేసిన చీమలు.. ఏం కేసు పెట్టాలని అడుగుతున్న అధికారి

ఇంటర్నెట్ డెస్క్: కొన్ని చిత్రమైన దొంగతనాల గురించి వింటూ ఉంటాం. దొంగతనమే అయినా వాటి గురించి విన్నప్పుడు ఆసక్తిగా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఆ మధ్య తమిళనాడులో జరిగిన కోడి కేసు గురించి తెలిసిన వారెవరూ అంత ఈజీగా మర్చిపోరు. అన్ని కేసుల్లో కోడి కేసు పెద్దదంటూ ఆ సమయంలో నెటిజెన్లు పెద్ద ఎత్తున జోకులు వేసుకున్నారు. ఈ దొంగతనాన్ని సరైందని చెప్పలేం కానీ, దానిపై బాధితుడు చేసిన హడావుడి చాలా మందికి ఆసక్తిని కలిగించింది. తాజాగా జరిగిన ఒక దొంగతనం దానికి మరిన్ని రెట్ల ఆశ్చర్యాన్ని ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఈసారి దొంగతనం చేసింది మనుషులు కాదు, కొన్ని చీమలు. అది కూడా ఏ పప్పులో ఉప్పులో కాదు. ఏకంగా ఒక బంగారు గొలుసును ఎత్తుకెళ్లాయి. ఎత్తుకెళ్తూ ఎత్తుకెళ్తూ కెమెరాకు చిక్కాయి. అంతే బాగానే ఉంది కానీ, గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిన చీమలపై ఏం కేసు పెట్టి అరెస్ట్ చేయాలో అర్థం కావడం లేదట.


సుసాంత సింగ్ అనే ఒక ఐఎఫ్ఎస్ అధికారికి ఎదురైన వింత అనుభవం ఇంది. తన ట్విట్టర్ ఖాతాలో పదుల సంఖ్యలో గోల్డ్ చైన్‌ను ఎత్తుకెళ్తున్న చీమలకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ‘‘బుల్లి గోల్డ్ స్మగ్లర్లు.. ఇక్కడ ప్రశ్నేంటంటే.. ఈ చీమలపై ఐపీసీలోని ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి?’’ అని ట్వీట్ చేశారు. కాగా, ఈ అధికారి ట్వీట్‌కు నెటిజెన్లు అదే రీతిలో స్పందిస్తున్నారు. ‘‘వాటిపై పెట్టాల్సింది ఐపీసీ సెక్షన్ కింద కాదు, ఏపీసీ (యానిమల్ పీనల్ కోడ్)’’ అంటూ ఒక వ్యక్తి స్పందించారు. ఇంకో వ్యక్తి స్పందిస్తూ ‘‘ఆల్‌రెడీ వాటిపై ఐపీసీ అమలైంది. అదే ఇన్‌సెక్ట్(క్రిమి) పీనల్ కోడ్’’ అని ట్వీట్ చేశారు. చీమల దొంగనతం వెనకున్న మాస్టర్‌మైండ్‌ను అర్థం చేసుకోవాలని మరొకరు స్పందించగా ‘‘కొంత పంచదారను ఇచ్చి గోల్డ్‌ చైన్‌ను సొంతం చేసుకోగలమా?’’ అంటూ మరొకరు స్పందించారు.

Updated Date - 2022-06-30T01:09:19+05:30 IST