'అనుకోని అతిథి' ట్రైలర్ విడుదల

May 26 2021 @ 14:44PM

సాయి పల్లవి, ఫహద్ ఫాజిల్ నటించిన మలయాళ హిట్ సినిమా 'అథిరన్'. ఆహాలో దీనిని 'అనుకోని అతిథి' పేరుతో స్ట్రీమింగ్‌కు రెడీ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఆహాలో మరో మంచి కంటెంట్ ఉన్న సినిమా విడుదల కాబోతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో హిట్ అయిన సినిమాలను డబ్ చేసి ఆహాలో విడుదల చేస్తున్నారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే 'అనుకోని అతిథి'ని తీసుకురాబోతున్నారు. మే 28న విడుదల కాబోతున్న ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించారు. ప్రకాశ్ రాజ్ లాంటి విలక్షణ నటుడు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సాయి పల్లవికి తెలుగులో ఉన్న క్రేజ్ కారణంగా భారీగానే అంచనాలున్నాయి. చూడాలి 'అనుకోని అతిథి' ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.