Advertisement

35 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లో నటిస్తోన్న బాలీవుడ్‌ స్టార్‌

Mar 7 2021 @ 15:52PM

టాలీవుడ్‌ రేంజ్‌ను బాలీవుడ్‌ తాకింది. బాలీవుడ్‌ సినిమాలకు ధీటుగా సౌత్‌ నుంచి సినిమాలు రూపొందుతున్నాయి. దీంతో బాలీవుడ్‌ స్టార్స్‌ మన దక్షిణాది సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌ చిత్రాల్లో నటించడానికి వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ ఇది వరకు సైరా నరసింహారెడ్డిలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ సినిమాలో అమితాబ్‌, దీపికా పదుకొనె వంటి స్టార్స్‌ నటిస్తున్నారు. అలాగే ట్రిపుల్‌ ఆర్‌ చిత్రంలో అయితే అజయ్‌ దేవగణ్‌,ఆలియా భట్‌ నటిస్తున్నారు. ఇలా బాలీవుడ్‌ తారలు తెలుగు సినిమాల్లో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు.

 

తాజాగా వీరి బాటలోకి మరో సీనియర్‌ బాలీవుడ్‌ స్టార్‌, విలక్షణ నటుడు అనుపమ్‌ ఖేర్‌ అడుగు పెట్టారు. హీరో నిఖిల్,డైరెక్ట‌ర్ చందు మొండేటి కాంబినేష‌న్‌లో వచ్చిన ‘కార్తీకేయ’ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘కార్తీకేయ 2’ ప్రారంభమైంది. ఏప్రిల్ నుంచి 'కార్తికేయ 2' షూటింగ్‌ని మొదలు పెట్టనున్నారు. 'కార్తికేయ 2' చిత్రంలో ధన్వంతరి అనే పాత్రధారిగా అనుపమ్‌ ఖేర్‌ నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. 1986లో ‘త్రిమూర్తులు’ అనే చిత్రంలో నటించారు అనుపమ్. దాదాపు 35 తర్వాత మళ్లీ తెలుగులో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్ కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని. దీనికి సంబంధించిన ఫొటోల‌ను, తాజాగా చిత్ర బృందం విడుద‌ల చేసింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై టీ.జి విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.