రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌గా అనుపమ అంజలి

ABN , First Publish Date - 2020-08-08T09:23:47+05:30 IST

రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌గా 2018బ్యాచ్‌కు చెందిన అనుపమ అంజలి నియమితులయ్యారు.

రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌గా అనుపమ అంజలి

రాజమహేంద్రవరం, ఆగస్టు7 (ఆంధ్రప్రదేశ్‌) : రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌గా 2018బ్యాచ్‌కు చెందిన అనుపమ అంజలి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. ప్రస్తుతం ఆమె విజయవాడలో ట్రైనీ ఐఏఎస్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన రావిరాల మహేష్‌కుమార్‌ జేసీగా పదోన్నతిపై బదిలీ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మున్సిపల్‌ కమిషనర్‌ అభిషిక్ట్‌ కిశోర్‌ ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ యువ మహిళా అధికారి అనుపమ అంజలి త్వరలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో కూడా ఒక మహిళా ఐఏఎస్‌ అధికారిణి ఇక్కడ బాధ్యతలు నిర్వహించారు.

Updated Date - 2020-08-08T09:23:47+05:30 IST