Advertisement

అనుపమ మళ్లీ బిజీ కాబోతోందా?

Oct 10 2020 @ 14:26PM

`ప్రేమమ్` సినిమాతో దక్షిణాదిన గుర్తింపు సంపాదించుకున్న అనుపమా పరమేశ్వరన్ తెలుగులో ప్రముఖ కథానాయికగా ఎదిగింది. పలువురు యంగ్ హీరోల సరసన నటించింది. ఇటీవల తెలుగు తెరకు కాస్త దూరమైన అనుపమ మళ్లీ టాలీవుడ్‌లో సందడి చేయబోతోందట. వరుస సినిమాలతో బిజీ కాబోతోందట. 


తెలుగులో రెండు సినిమాలను అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ రెండు సినిమాల్లోనూ యువ హీరో నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్నాడట. నిఖిల్ నటించనున్న `కార్తికేయ 2`, `18 పేజెస్` సినిమాల్లో అనుపమ ఛాన్స్ కొట్టేసిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.



Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.