
బాలీవుడ్లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు జాన్ అబ్రహం(John Abraham). ‘ఫోర్స్’, ‘సత్యమేవజయతే’ చిత్రాలతో అభిమానులను అలరించారు. జాన్ దగ్గర మలయాళంలో హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ (Ayyappanum Koshiyum)రీమేక్ రైట్స్ ఉన్నాయి. ఆయన సొంత నిర్మాణ సంస్థ ‘జేఏ ఎంటర్టైన్మెంట్’ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. కానీ, అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కడం లేదు. తాజాగా ఈ మూవీకి డైరెక్టర్‌ను ఫిక్స్ చేశారని బీ టౌన్ మీడియా తెలుపుతుంది. క్రియేటివ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారని పుకార్లు షికార్లు కొడుతున్నాయి.
‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించాలని గతంలో జగన్ శక్తి (Jagan Shakti)ని జాన్ అబ్రహం కోరారు. కానీ, జాన్ అంచనాలకు తగ్గట్టుగా ఆయన స్క్రిఫ్ట్‌ను డిజైన్ చేయలేదు. అందువల్ల ఆ స్క్రిప్ట్‌పై పనిచేయాలని అనురాగ్ కశ్యప్‌ను కోరారు. అందుకు అనురాగ్ అంగీకారం తెలిపారని సమాచారం. ఈ ఏడాది అక్టోబరులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్పటిలోగా జాన్ అబ్రహం ‘టెహ్రాన్’ చిత్రాన్ని పూర్తి చేస్తారు. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ తెలుగులో ‘భీమ్లా నాయక్’ టైటిల్‌తో రీమేక్ అయింది. పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ విజయం సాధించింది.