విరాట్, అనుష్క కూతురి ఫోటోలు మరోసారి వైరల్.. వామిక విషయంలో తమ వైఖరి మారదంటూ..

Published: Mon, 24 Jan 2022 13:53:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విరాట్, అనుష్క కూతురి ఫోటోలు మరోసారి వైరల్.. వామిక విషయంలో తమ వైఖరి మారదంటూ..

దేశంలో ఎంతో క్రేజ్ ఉన్న కపుల్స్‌లో భారత క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఒకటి. ఈ జంటకి గతేడాది జనవరిలో ఓ పాప జన్మించిన సంగతి తెలిసిందే. ఆ పాపకు వామిక అనే పేరు కూడా పెట్టుకున్నారు. అయితే పాప పుట్టి ఏడాది దాటినా.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తమ ముద్దుల తనయ పిక్స్‌ను బయటికి రాకుండా ఈ జంట జాగ్రత్త పడింది. 


అయితే అనుకోకుండా ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య క్రికెట్ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో విరాట్ బ్యాటింగ్ చేస్తుండగా.. అనుష్క శర్మతో పాటు ఉన్న వామిక స్టేడియంలో ఉన్న ఫోటోలు తాజాగా నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. స్టేడియంలో కెమెరా పర్సన్ కెమెరాలను వారివైపు పెట్టడంతో ఆ ఫొటోలు బయటికి వచ్చాయి. దీంతో ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.


ఆ విషయాన్ని గమనించిన అనుష్క వాటిని డిలీట్ చేయమని సోషల్ మీడియాలో ద్వారా మరోసారి రిక్వెస్ట్ చేసింది. ‘హాయ్ ఫ్రెండ్స్.. నిన్న స్టేడియంలో ఉండగా మా కూతురు ఫోటోలు అనుకోకుండా క్లిక్ అయ్యాయి. ఆ తర్వాత అవి నెట్టింట విపరీతంగా షేర్ అయ్యాయని మా దృష్టికి వచ్చింది. స్టేడియంలో కెమెరా మాపై ఉందని మాకు తెలియదు. ఇది అనుకోకుండా జరిగింది. వామిక విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఆమెకు మేం ప్రైవసీని ఇవ్వాలనుకుంటున్నాం. గతంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరగింది. ఆ సమయంలో మేం ప్రత్యేకంగా కోరడం వల్ల మీడియా మిత్రులు ఫొటోలు తీయలేదు. అప్పటికే తీసిన ఫొటోలను కూడా పబ్లిష్ చేయలేదు. దీనికి మేము ఎంతో సంతోషించాం. తాజాగా జరిగిన ఘటనలో కూడా వామిక ఫొటోలు అనుకోకుండా బయటకు వచ్చాయి. వాటిని డిలీట్ చేయమని కోరుతున్నాం.. మా విన్నపాన్ని మన్నించండి’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అనుష్క ఓ పోస్ట్‌ను పెట్టింది. ఈ ఇన్‌స్టా స్టోరీని అనుష్క పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే విరాట్ కూడా షేర్ చేశాడు.

విరాట్, అనుష్క కూతురి ఫోటోలు మరోసారి వైరల్.. వామిక విషయంలో తమ వైఖరి మారదంటూ..

కాగా, కొంతమంది అభిమానులు వామికను మొదటిసారి చూసి, ఆమె క్యూట్‌నెస్‌కి మంత్రముగ్ధులపోయారు. అయితే మరికొందరు నెటిజన్లకు మాత్రం వారి గోప్యతకి భంగం కలిగించడం నచ్చలేదు. గతంలోనూ ఇలాగే ముంబై నుంచి ఎయిర్‌పోర్ట్‌లో వామిక తన తల్లి అనుష్కతో ఉన్నప్పుడు మీడియా కంటపడింది. కానీ విరాట్ దంపతుల అభ్యర్థన కారణంగా ఫోటోలు ప్రచురించలేదు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...