Anushka Sharma : నీకు అత్యాశ లేదు... నీకు హద్దులు లేవు

Published: Sun, 16 Jan 2022 18:17:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Anushka Sharma : నీకు అత్యాశ లేదు... నీకు హద్దులు లేవు

టీమిండియా కెప్టెన్‌గా అన్ని రకాల ఫార్మాట్స్‌కు గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీకి భార్య అనుష్క శర్మ ప్రత్యేక సందేశం అందించింది. ‘‘నువ్వు ఎప్పుడూ దేన్ని కూడా అత్యాశతో అంటిపెట్టుకోలేదు. ఈ పదవి కూడా అంతేనని నాకు తెలుసు’’ అందామె. అంతే కాదు, ‘‘ఎవరైనా దేన్నైనా గట్టిగా పట్టుకుని కూర్చుంటే అక్కడికే పరిమితం అయిపోతారు. కానీ, మై లవ్... నువ్వు హద్దులు లేనివాడివి!’’ అని కూడా అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. 


టెస్ట్ కెప్టెన్‌గా కూడా రాజీనామా చేసిన విరాట్ కోహ్లీ చాలా మందిని ఆశ్చర్యపరిచాడు. మిసెస్ కోహ్లీగా అనుష్క మరీ ఆశ్చర్యపోకపోయినా... ఆమె ఎమోషనల్‌గా ఫీలైందని మాత్రం చెప్పవచ్చు. తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూస్తే మనకు అదే భావం కలుగుతుంది. విరాట్ కెప్టెన్సీ రిటైర్మెంట్ విషయంలో సంపూర్ణ మద్దతు పలికిన అనూ తమ కూతురు వామికా పేరును కూడా ప్రస్తావించింది. ఏడేళ్ల పాటూ కోహ్లీ భారత క్రికెట్ జట్టును ముందుకు నడిపాడని అన్న ఆమె... ఆ అనుభవం ఖచ్చితంగా తమ వారసురాలికి ఉపయోగపడుతుందని చెప్పింది!

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...